ఎయిరిండియాలో కుంభకోణం.. మాజీ సీఎండీపై సీబీఐ ఛార్జ్‌ షీటు దాఖలు

5 Feb, 2024 20:43 IST|Sakshi

ఎయిరిండియాలో జరిగిన కుంబకోణం వెలుగులోకి వచ్చింది. 2011లో సాఫ్ట్వేర్ కొనుగోలు సమయంలో రూ.225 కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ సీబీఐ ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేసింది. సాఫ్ట్‌వేర్ కొనుగోళ్లలో విధానపరమైన అవకతవకలను ప్రాథమికంగా గుర్తించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సిఫారసు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది.
  
దాదాపు ఆరేళ్ల విచారణ తర్వాత, సీబీఐ మాజీ సీఎండీ ఎయిర్‌ ఇండియా అరవింద్‌ జాదవ్‌, ఐబీఎం ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎస్‌ఏపీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్‌ 120-బి (నేరపూరిత కుట్ర) కింద ఛార్జ్‌షీటు దాఖలు చేసింది.  

సరైన టెండరింగ్ విధానాన్ని అనుసరించకుండానే నేషనల్ క్యారియర్ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్‌పీ) సాఫ్ట్‌వేర్ను శాప్‌ ఏజీ నుంచి కొనుగోలు చేసినట్లు ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక విచారణలో తేలిందని సీవీసీ సీబీఐకి అందించిన నోట్‌లో పేర్కొంది.

2009 జూలై 9న గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ముందు 2010లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందు ప్రజెంటేషన్ ఇచ్చామని ఎయిరిండియా తెలిపింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ఆమోదం లభించలేదని ఆరోపించింది

ఇప్పటికే గతంలో ఒరాకిల్ నుంచి తీసుకున్న ఈఆర్‌పీ సాఫ్ట్‌వేర్ ఉండగా, కొత్త సాఫ్ట్‌వేర్ ఎందుకు తీసుకున్నారన్న విషయమై క్లారిటీ లేదు. ఓపెన్ టెండర్ ప్రక్రియ చేపట్టకుండానే ఎస్ఏపీ, ఐబీఎంలకు నామినేషన్ పద్దతిలో ఈ కాంట్రాక్టును ఎయిర్ఇండియా అప్పగించిందన్న ఆరోపణలు ఉన్నాయి.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega