టాటా గ్రూప్‌ కిట్టీలోకి బిగ్‌బాస్కెట్‌!

30 Apr, 2021 13:52 IST|Sakshi

బిగ్‌బాస్కెట్‌ డీల్‌కు సీసీఐ ఓకే

టాటా గ్రూప్‌ చేతికి 64.3% వాటా

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గ్రోసరీ ప్లాట్‌ఫామ్‌ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి టాటా సన్స్‌ కంపెనీ టాటా డిజిటల్‌ లిమిటెడ్‌(టీడీఎల్‌)కు కాంపిటీషన్‌ కమిషన్‌(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో బిగ్‌బాస్కెట్‌లో 64.3 శాతం వాటాను టీడీఎల్‌ సొంతం చేసుకోనుంది. తద్వారా ఇటీవల వేగవంత వృద్ధి సాధిస్తున్న ఆన్‌లైన్‌ గ్రోసరీ మార్కెట్‌లో టాటా గ్రూప్‌ భారీ అడుగులు వేయనున్నట్లు విశ్లేషకులు చెప్పారు. 

డీల్‌లో భాగంగా బిగ్‌బాస్కెట్‌.కామ్‌ యజమాని సూపర్‌మార్కెట్‌ గ్రోసరీ సప్లైస్‌(ఎస్‌జీఎస్‌)లో టాటా సన్స్‌ సొంత అనుబంధ సంస్థ టీడీఎల్‌  మెజారిటీ వాటాను కొనుగో లు చేయనుంది. బిగ్‌బాస్కెట్‌ ద్వారా ఎస్‌జీఎస్‌.. బీటూబీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే బిగ్‌బాస్కెట్‌ ద్వారా బీటూసీ అమ్మకాలు చేపడుతున్న ఇన్నోవేటివ్‌ రిటైల్‌ కాన్సెప్‌్ట్సలోనూ ఎస్‌జీఎస్‌ పూర్తి వాటాను కలిగి ఉంది. 2011లో ఏర్పాటైన బిగ్‌బాస్కెట్‌ దేశవ్యాప్తంగా 25 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు.. గ్రోఫర్స్‌తో బిగ్‌బాస్కెట్‌ పోటీ పడుతుండటం తెలిసిందే.

చదవండి:

లాక్‌డౌన్ భయం.. భారీగా బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా?

మరిన్ని వార్తలు