వయాకామ్‌18 మీడియాలో జియో సినిమా ఓటీటీ విలీనం!

20 Sep, 2022 09:00 IST|Sakshi

న్యూఢిల్లీ: వయాకామ్‌18 మీడియాలో జియో సినిమా ఓటీటీ విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ ద్వారా సోమవారం ఈ విషయం వెల్లడించింది. బోధి ట్రీ సిస్టమ్స్‌ (బీటీఎస్‌)తో త్రైపాక్షిక ఒప్పందం  కుదుర్చుకుంటున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, వయాకామ్‌18 ప్రకటించాయి.

దీని ప్రకారం వయాకామ్‌18లో బీటీఎస్‌ రూ. 13,500 కోట్లు, రిలయన్స్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ రూ. 1,645 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తా యి. ఒప్పందంలో భాగంగా జియో సినిమా ఓటీటీ యాప్‌ను వయాకామ్‌18కి బదలాయించారు.

చదవండి: ఇన్ఫినిక్స్‌ నుంచి తొలి 55 ఇంచెస్‌ టీవీ.. తక్కువ ధరకే వావ్‌ అనిపించే ఫీచర్లు!

మరిన్ని వార్తలు