రిలయన్స్‌ ‘మెట్రో’ డీల్‌ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు

15 Mar, 2023 12:30 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా’ని రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ) సొంతం చేసుకునేందుకు కాంపిటిషన్‌ కమిషన్‌ (సీసీఐ) ఆమో దం తెలిపింది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత్‌లోని తన హోల్‌సేల్‌ కార్యకలాపాలను విక్రయించేందుకు రిలయన్స్‌తో ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం.

మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీలో 100 శాతం వాటాలను రూ.2,850 కోట్లతో కొనుగోలు చేసేందుకు రిలయన్స్‌ తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసింది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్, మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు ట్విట్టర్‌లో సీసీఐ ప్రకటించింది.    

ఇవీ చదవండి: ఇషా ట్విన్స్‌కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్‌: వీడియో వైరల్‌

ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు

మరిన్ని వార్తలు