మారుతి సుజుకిపై ₹200 కోట్ల జరిమానా విధించిన సీసీఐ

23 Aug, 2021 17:46 IST|Sakshi

దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 27 మిలియన్ డాలర్ల(₹200 కోట్ల) జరిమానా విధించింది. 2019లో మారుతి తన డీలర్లను వారు అందించే డిస్కౌంట్లను పరిమితం చేయాలని బలవంతం చేస్తుందనే వచ్చిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిశీలిస్తుంది. మారుతి సుజుకి చర్య వల్ల డీలర్ల మధ్య పోటీని సమర్థవంతంగా అణచివేస్తుంది, డీలర్లు స్వేచ్ఛగా పనిచేస్తే వినియోగదారులు తక్కువ ధరలకు కార్లను పొందే అవకాశం ఉంటుందని రాయిటర్స్ నివేదించింది.(చదవండి: రూ.9 వేలకే రియల్‌మీ ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌)

దర్యాప్తు తర్వాత సీసీఐ జారీ చేసిన ఒక ఉత్తర్వులో ఇక నుంచి అటువంటి విధానాలకు పాల్పడకుండా "నిలిపివేయాలి/విరమించుకోవాలని" మారుతిని కోరింది. అలాగే, జరిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని కంపెనీని కోరింది. ఈ విషయంపై మారుతి సుజుకి యాజమాన్యం ఇంకా స్పందించలేదు. దీంతో మారుతి సుజుకి షేర్లు నేడు పడిపోయి బిఎస్ఈలో ₹6,835.00(0.23%) వద్ద ఉన్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మొత్తం ఉత్పత్తి సంవత్సరానికి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లకు చేరుకుంది. ఏడాది క్రితం కాలంలో కంపెనీ మొత్తం 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసిందని మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది.

మరిన్ని వార్తలు