కాఫీ బోర్డులోకి శ్రీశాంత్‌

17 Sep, 2022 04:06 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రతిష్టాత్మక భారత కాఫీ బోర్డు సభ్యుడిగా సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఎండీ చల్లా శ్రీశాంత్‌ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇన్‌స్టాంట్‌ కాఫీ తయారీదార్ల తరఫున సభ్యుడిగా బోర్డు ఆయనను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అత్యధికంగా అయిదుగురికి బోర్డులో స్థానం దక్కడ విశేషం. ‘ఏపీలో కాఫీ సాగుపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్టు దీనినిబట్టి అర్థం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటే భారత్‌లో కాఫీ ఉత్పత్తి రెండింతలు అవుతుంది’ అని శ్రీశాంత్‌ ఈ సందర్భంగా తెలిపారు.  

 

మరిన్ని వార్తలు