వాళ‍్లు జుట్టు కత్తిరించుకున్నా సంచలనమే!

19 Jun, 2021 10:19 IST|Sakshi

బిజినెస్‌ రంగాన్ని శాసిస్తున్న ప్రముఖులు 

ఒక్క యాక్షన్‌ తో వేలకోట్ల నష్టం 

సాక్షి, వెబ్‌డెస్క్‌: పబ్లిక్‌ ఫిగర్స్‌ (ప‍్రముఖులు)వేలకోట్ల  వ్యాపార రంగాన్ని కనుసైగతో శాసిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుండు సూది నుంచి మొదలు  అమ్మకాలు పుంజుకోవాలంటే వాళ్లు ఆయా బ్రాండ్‌ లతో ఒక్క చిన్న మూమెంట్ ఇస్తే చాలు. అమ్మకాలు తారా స్థాయికి చేరుకుంటాయి. వ్యతిరేకిస్తే అథోఃపాతానికి పడిపోతాయి. అందుకు ఉదాహరణే ఇటీవల జరిగిన ఓ సంఘటన.  ప్రెస్‌ మీట్‌ లో  పోర్చుగల్‌ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డో కోక్‌ బాటిళ్లను పక్కకు జరిపి ‘మంచి నీళ్లే తాగాలంటూ’ సైగ చేశారు. ఆ సైగతో కోలా బ్రాండ్‌ భారీ నష్టాల్ని చవిచూసింది. ఇలా ఒక్కరొనాల్డోనే కాదు గతంలో పలువురు ప్రముఖులు సింగల్‌ యాక్షన్‌ తో ఆయా కంపెనీలు వేలకోట్లు నష్ట పోయాయి.  

క్రిస్టియానో రొనాల్డో : ప్రెస్‌ మీట్‌ లో కోకా కోలా బాటినళ్లను పక్కనపెట్టి మంచినీళ్లు తాగండని పది సెకన్ల యాక్షన్‌ వల్ల ఆ కంపెనీకి ఊహించని రీతిలో డ్యామేజ్‌ జరిగింది. కోలా షేర్లు  56.17 డాలర్ల నుంచి 55.22 డాలర్లకు పడిపోవడంతో 4 బిలియన్ డాలర్లను నష్టపోయింది.  

ఎలాన్‌ మస్క్‌ :  టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గత నెల మే1న ఓ ట్వీట్‌ చేశారు. టెస్లాకార్లు కొనుగోలు చేయాలంటే బిట్‌ కాయిన్స్‌ ను అనుమతించబోమని ట్వీట్‌ లో పేర్కొన్నాడు. దీంతో బిట్‌ కాయిన్‌ వ్యాల్యూ 17శాతానికి పడిపోయింది. ట్వీట్‌ కు ముందు బిట్‌ కాయిన్‌ వ్యాల్యూ  54,819 డాలర్లు కాగా, ట్వీట్ తర్వాత 45,700 క్షీణించింది.  

సుచేతాదలాల్‌ : ప్రముఖ బిజినెస్‌ జర్నలిస్ట్‌ సుచేతాదలాల్‌. బిజినెస్‌ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. 1992 లో స్టాక్‌ మార్కెట్‌ లో  ‘హర్షద్ మెహతా’ కుంభకోణం గురించి ఒక్క ఆర‍్టికల్‌ రాసింది. ఆ ఒక్క ఆర్టికల్‌ తో మదుపర్లు స‍్టాక్‌ మార్కెట్‌ కా బచ్చన్‌ అని పిలుచుకునే హర్షద్‌ మెహతాను రోడ్డు కీడ్చారు. తాజాగా అదానీ గ్రూప్‌ గురించి డైరెక్ట్‌గా చెప్పకపోయినా విదేశీ సంస్థల పెట్టుబడులతో సెబీ నిఘా వ్యవస్థలు గుర్తించలేని స్థాయిలో మరో కుంభకోణం జరుగుతోందని ట్వీట్‌ చేశారు. అంతే.. ఆ ట్వీట్‌తో అదానీ గ్రూప్‌ వేలకోట్లు నష్టపోయింది. చదవండి: క్రెడిట్‌ కార్డ్‌ స్కోర్‌ బాగున్నా, లోన్‌ ఎందుకు రిజెక్ట్‌ అవుతుందో తెలుసా?

కైలీ జెన్నర్ : నటి కిమ్‌ కర్దాషియన్‌ చెల్లెలు, ప్రముఖ కైలీ కాస్మోటిక్‌ ప్రాడక్ట్‌ అధినేత కైలీ జెన్నర్‌ 2018లో స్నాప్‌ చాట్‌ కొత్త లే అవుట్‌ తెచ్చింది. దీంతో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై కైలీ ఇకపై తాను స్నాప్‌చాట్‌ను ఉపయోగించడం లేదని తెలిపింది. ఆ ట్వీట్‌ తో  కంపెనీకి స్టాక్ మార్కెట్లో 1.3 బిలియన్ డాలర్లును నష్టపోయింది.

 

డేవిడ్ బెక్హాం :  1997లో డేవిడ్‌ బెక్హాం హెయిర్‌ స్టైలిష్‌ ప్రాడక్ట్‌కు చెందిన బ్రైల్‌ క్రీమ్‌ సంస్థతో ప్రమోషన్‌ కోసం 4 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం తరువాత డేవిడ్‌ బెక్హాం తన జుట్టును పూర్తిగా కత్తిరించుకోవడంతో బ్రైల్‌ క్రీమ్‌ అమ్మకాలు పడిపోయాయి. దీంతో ఆ కంపెనీ వేలకోట్ల నష్టాన్ని చవిచూసింది.  

షరాన్ స్టోన్: 2008లో ప్రముఖ ప్యాషన్‌ కంపెనీ డియోర్‌ అమెరికాకు చెందిన ప్రముఖ నటి షరాన్‌ స్టోన్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఏడాది చైనాలో భూకంపం సంభవించి 68 వేలమంది ప్రాణాలు కోల‍్పోయారు. దీంతో 'బ‍్యాడ్‌ కర్మ' అంటూ స్టోన్‌ వ్యాఖ‍్యానించింది. అంతే డియోర్‌ కంపెనీ నష్టాల బాటపట్టింది. చైనాలో షరాన్‌ స్టోన్‌ సినిమాలపై నిషేధానికి గురయ్యాయి.  


 

మరిన్ని వార్తలు