లాభాల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌, కోట్లల్లో నికర లాభం

29 Jul, 2021 11:51 IST|Sakshi

ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ. 206 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 135 కోట్లతో పోలిస్తే ఇది 53 శాతం అధికం. ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,349 కోట్ల నష్టం ప్రకటించింది. మరోవైపు, క్యూ1లో ఆదాయం రూ. 6,727 కోట్ల నుంచి రూ. 6,246 కోట్లకు తగ్గింది.

నికర వడ్డీ ఆదాయం దాదాపు గత క్యూ1 స్థాయిలో రూ. 2,135 కోట్లుగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) 18.10 శాతం నుంచి 15.92 శాతానికి, నికర ఎన్‌పీఏలు 6.76 శాతం నుంచి 5.09 శాతానికి తగ్గాయి.  బుధవారం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు సుమారు 1.4 శాతం క్షీణించి రూ. 24.45 వద్ద ముగిశాయి. 

మరిన్ని వార్తలు