సెంట్రల్‌ బ్యాంక్‌ లాభం హైజంప్‌

19 Jan, 2023 09:52 IST|Sakshi

క్యూ3లో రూ. 458 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 458 కోట్లను తాకింది. మొండి రుణాలు తగ్గడం, వడ్డీ ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 279 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం సైతం రూ. 6,524 కోట్ల నుంచి రూ. 7,636 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 3,285 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 15.16 శాతం నుంచి 8.85 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్‌పీఏలు సైతం4.39 శాతం నుంచి 2.09 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 0.22 శాతం తగ్గి 13.76 శాతానికి చేరింది. ఫలితాల నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 0.5 శాతం నష్టంతో రూ. 32.40 వద్ద ముగిసింది.

చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!

మరిన్ని వార్తలు