ఎగుమతుల పెంపుకు కేంద్రం వ్యూహం.. బ్రాండ్‌ ఇండియాపై భరోసా..

5 Jan, 2022 09:09 IST|Sakshi

బ్రాండ్‌ ఇండియాపై ముమ్మర ప్రచారం 

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఎగుమతులను మరింతగా పెంచుకునేందుకు వీలుగా కేంద్ర వాణిజ్య శాఖ ‘బ్రాండ్‌ ఇండియా’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 400 బిలియన్‌ డాలర్లను మించనున్నాయని అంచనా. దీంతో భారత్‌ చేసే వస్తు, సేవల ఎగుమతులకు మరింత ప్రచారం తీసుకురావడం ద్వారా ఎగుమతులు పెంచుకోవాలని వాణిజ్య శాఖ భావిస్తోంది. 

బ్రాండ్‌ ఇండియా ప్రమోషన్‌లో భాగంగా ముందుగా జెమ్స్, జ్యుయలరీ, టెక్స్‌టైల్స్, ప్లాంటేషన్, టీ, కాఫీ, మసాలా దినుసులు, విద్య, హెల్త్‌కేర్, ఫార్మా, ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రచారం కల్పించనుంది. నాణ్యత, వారసత్వం, టెక్నాలజీ, విలువ, ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇండియా బ్రాండ్‌ ఈక్విటీ ఫౌండేషన్‌ (ఐబీఈఎఫ్‌) నిర్వహిస్తున్న బ్రాండ్‌ ఇండియా ప్రచారం పురోగతిపై ఇటీవలే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ సమీక్ష నిర్వహించారు. భారత్‌లో తయారీ అయ్యే ఉత్పత్తులు, సేవల గురించి అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రచారం, అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఐబీఈఎఫ్‌.
 

మరిన్ని వార్తలు