ఐడీబీఐ వాటాల అమ్మకాల ప్రక్రియ షురూ

23 Jun, 2021 07:53 IST|Sakshi

ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటాల విక్రయ ప్రక్రియ

బిడ్లను ఆహ్వానించిన కేంద్రం 

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంకులో వ్యూహాత్మక వాటాల విక్రయ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వాటాల విక్రయం విషయంలో సేవల కోసం లావాదేవీల సలహాదారులు, న్యాయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ పెట్టుడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌) ప్రకటన విడుదల చేసింది. బిడ్లను సమర్పించేందుకు జూలై 13 వరకు గడువు ఇచ్చింది. ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ 49.24 శాతం వాటాతో ప్రమోటర్‌గా ఉండగా.. కేంద్ర ప్రభుత్వానికీ 45.48 శాతం వాటా ఉంది.   

చదవండి: బ్యాంకులకు ‘వీడియోకాన్‌’ లో 8 శాతం వాటాలు

మరిన్ని వార్తలు