యాక్సిస్‌ బ్యాంక్‌కు కేంద్రం గుడ్‌బై!

11 Nov, 2022 07:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యాక్సిస్‌ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా ప్రత్యేక విభాగం (ఎస్‌యూయూటీఐ) ద్వారా మిగిలిన 1.55% వాటాను ప్రభుత్వం విక్రయించనున్నట్లు యాక్సిస్‌ బ్యాంకు తాజాగా పేర్కొంది. మొత్తం 4,65,34,903 షేర్లను ప్రభుత్వం ఆఫర్‌ చేయనున్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. 

తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 4,000 కోట్లు లభించే వీలుంది. వెరసి యాక్సిస్‌ బ్యాంకు నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. కాగా.. గతేడాది మే నెలలోనూ ప్రభుత్వం ఎస్‌యూయూటీఐ  ద్వారా యాక్సిస్‌ బ్యాంకులో 1.95 శాతం వాటాను విక్రయించింది. ఈ వార్తల నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 4% పతనమై రూ. 841 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు