ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ!

9 Aug, 2022 16:55 IST|Sakshi

న్యూఢిల్లీ: కేం‍ద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు కోసం 8వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పట్లో ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులే ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదని అందుకే కొత్త సంఘం ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. ఉద్యోగుల జీతాల పెంపునుకు ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ సవరిస్తున్నట్లు తెలిపారు. 

ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డీఏ(DA) పెంపు అంచనా
ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మరోసారి డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం రేట్లు అలాగే ఉన్నందున, కేబినెట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ డీఏను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నిర్ణయాన్ని త్వరలో ప్రకటించనున్నారని సమాచారం. గత కొంతకాలంగా 7% కంటే ఎక్కువగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆధారంగా డీఏ లెక్కిస్తున్నారు.

నివేదికల ప్రకారం, డీఏ 3% నుంచి 4% మధ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులందరికీ 34% డీఏ అందుతోంది. 50 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు డీఏ సవరణ ప్రయోజనాలను పొందుతున్నారు. కాగా ప్రభుత్వం 7వ కేంద్ర వేతన సంఘాన్ని ఫిబ్రవరి 28, 2014న ఏర్పాటు చేసింది.

చదవండి: వారానికి 4 రోజులే పని, త్వ‌ర‌లోనే అమ‌ల్లోకి కొత్త లేబ‌ర్ చ‌ట్టాలు!

మరిన్ని వార్తలు