కంపెనీల ఏర్పాటు నిబంధనల్లో మార్పులు

26 Jul, 2021 10:47 IST|Sakshi

న్యూఢిల్లీ: కంపెనీల చట్టం 2013లో కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సవరించింది. సవరించిన నిబంధనలు సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి. సెక్షన్‌ 16 కింద ప్రస్తుత కంపెనీకి నూతన పేరును కేటాయించే విషయంలో మార్పులను తీసుకొచ్చింది. ఇదే సెక్షన్‌ కింద ఒక కంపెనీ పేరు మరో కంపెనీతో పోలి ఉంటే.. మార్చుకోవాలంటూ కేంద్రం ఆదేశించొచ్చు. ఇలా ఆదేశిస్తే మూడు నెలల్లోగా కంపెనీ పేరును మార్చుకోవాల్సి ఉంటుంది. నూతన నిబంధనల కింద నిర్ణీత గడువులోపు పేరు మార్పును అమల్లోకి తీసుకురాకపోతే.. అప్పుడు కంపెనీ పేరు చివర్లో ‘ఓఆర్‌డీసీ’ని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ చేరుస్తుంది.   

మరిన్ని వార్తలు