కేంద్రానికి కాసుల వర్షం! భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ అదుర్స్‌..

18 Sep, 2023 18:09 IST|Sakshi

కార్పొరేట్ల నుంచి అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపులు గణనీయంగా పెరగడంతో సెప్టెంబర్ నెల మధ్య నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ( Direct Tax Collection) 23.51 శాతం పెరిగి రూ.8.65 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది.

(ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉ‍ద్యోగులకు బిగ్‌ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం)

సెప్టెంబర్ 16 నాటికి నికరంగా రూ. 8,65,117 కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలయ్యాయి. ఇందులో కార్పొరేట్ ఆదాయ పన్ను (సీఐటీ) రూ. 4,16,217 కోట్లు. వ్యక్తిగత ఆదాయ పన్ను (పీఐటీ),   సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్‌టీటీ) కలిపి రూ. 4,47,291 కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ 16 నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 23.51 శాతానికి పైగా పెరిగాయని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

(EPFO:వేతన జీవులకు షాక్‌.. తగ్గనున్న పీఎఫ్‌ వడ్డీ!)

అడ్వాన్స్‌ ట్యాక్స్‌ అదుర్స్‌
ముందస్తు పన్ను వసూళ్లు సెప్టెంబర్ మధ్య వరకు రూ. 3.55 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలు చేసిన రూ. 2.94 లక్షల కోట్లతో పోలిస్తే ఇవి 21 శాతం పెరిగాయి. సెప్టెంబర్ 16 నాటికి వసూలైన రూ. 3.55 లక్షల కోట్ల ముందస్తు పన్ను వసూళ్లలో కార్పొరేట్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రూ. 2.80 లక్షల కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్ను రూ. 74,858 కోట్లు ఉన్నాయి. ఇక సెప్టెంబర్ 16 వరకు దాదాపు రూ.1.22 లక్షల కోట్ల రీఫండ్‌లను ట్యాక్స్‌ పేయర్స్‌కు ప్రభుత్వం జారీ చేసింది.

(PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..)

మరిన్ని వార్తలు