అమ్మకానికి మరో ప్రభుత్వ సంస్థ, కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌!

1 May, 2022 16:48 IST|Sakshi

2021 ఆర్ధిక సంవత్సరంలో ఎయిరిండియాను ప్రైవేట్‌ పరం చేసిన కేంద్రం.. ఇప్పుడు మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ రంగ హెలికాప్టర్ సర్వీస్ ప్రొవైడర్ పవన్ హన్స్ లిమిటెడ్ ను స్టార్‌ 9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అమ్మేందుకు సిద్ధమైంది.

 

పవన్ హన్స్‌లో కేంద్రప్రభుత్వానికి 51 శాతం వాటా ఉండగా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌కు 49 శాతం మేర ఇందులో వాటాలు ఉన్నాయి. అయితే వరుస నష్టాలతో కేంద్రం పవన్‌ హన్స్‌లో వాటాను ఉపసంహరించుకునేందుకు సిద్ధం కాగా..ఇప్పటికే ఓఎన్జీసీ సైతం తన వాటాను కేంద్రం నిర్ణయించిన వాటాకే అమ్మేందుకు సిద్ధమైంది.

 

తాజాగా ఈ అమ్మకానికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సభ్యులు,కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, జ్యోతిరాదిత్య ఆమోదం తెలిపారు. కాగా 2019-20లో పవన్‌ హాన్స్‌ రూ.28.08 కోట్లు, 2018-19లో రూ.69.2 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2020-21, 2021-22లో రూ.100 కోట్ల నికర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అందుకే కేంద్రం పవన్‌ హాన్స్‌ను ప్రైవేట్‌ పరం చేసేందుకు సిద్ధమైనట్లు ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి👉బీపీసీఎల్‌ ప్రయివేటైజేషన్‌, కొత్త దారిలో అమ్మకానికి సన్నాహాలు!

మరిన్ని వార్తలు