ముడిచమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ పెంపు 

17 Oct, 2022 07:44 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తయ్యే ముడి చమురు, డీజిల్‌ .. ఏటీఎఫ్‌ ఎగుమతులపై కేంద్రం విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ ను పెంచింది. క్రూడాయిల్‌పై టన్నుకు రూ. 8,000గా ఉన్న సుంకాన్ని రూ. 11,000కు పెంచింది. అలాగే డీజిల్‌ ఎగుమతులపై లీటరుకు రూ. 5 నుంచి రూ. 12కు పెంచింది. ఈ నెల ప్రారంభంలో దాదాపు సున్నా స్థాయికి దిగి వచ్చిన ఏటీఎఫ్‌ (విమాన ఇంధనం)పై తిరిగి సుంకాలు విధించింది.

లీటరుకు రూ. 3.50 మేర నిర్ణయించింది. అంతర్జాతీయంగా చమురు రేట్లు భారీగా పెరగడం వల్ల వివిధ ఇంధనాలపై ఆయిల్‌ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద విధించే సుంకాలను విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇతర దేశాల బాటలో దేశీయంగా జూలై 1న కేంద్రం వీటిని విధించింది. ఆ తర్వాత ధరలు కొంత తగ్గుముఖం పట్టడంతో సెప్టెంబర్‌లో రెండు విడతల్లో వాటిని తగ్గించింది.  దేశీ క్రూడాయిల్‌పై పన్నులతో ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, వేదాంత వంటి సంస్థలపై ప్రభావం పడనుంది. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్‌ రిఫైనింగ్‌ కంపెనీలు.. డీజిల్, ఏటీఎఫ్‌ మొదలైన ఇంధనాలను ఎగుమతి చేస్తున్నాయి.

చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! 

మరిన్ని వార్తలు