ఏవియేషన్‌ సెక్టార్‌కి భారీ షాక్‌ ! విమాన రంగం ఇప్పట్లో కోలుకునేనా ?

1 Feb, 2022 11:02 IST|Sakshi

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు అయ్యింది ఏవియేషన్‌ సెక్టార్‌ పరిస్థితి. కరోనా ఎఫెక్ట్‌తో గత రెండేళ్లుగా నష్టాలతో కునారిళ్లుతున్న విమానయాన రంగం, ఈ బడ్జెట్‌లో తమకేమైనా ఉద్దీపనలు లభిస్తాయనే ఆశతోంది. కానీ ఏవియేషన్‌ సెక్టార్‌ ఆశలపై నీళ్లు కుమ్మరించింది కేంద్రం. అనూహ్యంగా ఏవియేషన్‌ ఫ్యూయల్‌ ధర 8.5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

కరోనా విజృంభించినా తర్వాత విమనా ప్రయాణాలపై ఆంక్షలు వచ్చాయి. మరోవైపు ప్రజలు సైతం ప్రయాణాలు మానుకున్నారు. దీంతో ఏవియేషన్‌ సెక్టార్లో డిమాండ్‌ తగ్గిపోయింది. దాదాపు అన్ని సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయి. ఈ సమయంలో విమానాల్లో ఉపయోగించే వైట్‌ పెట్రోలు ధరలను 8.5 శాతం పెంచడం విమానయాన సంస్థలను ఇరకాటంలో పెట్టింది. ఇప్పటికే డిమాండ్‌ తగ్గిపోయిన తరుణంలో టిక్కెట్ల రేట్లను పెంచాలా ? లేక పెరిగిన ఛార్జీలను భరించాలా ? అనేది ఆ సంస్థలకు కష్టంగా మారనుంది.

గతేడాది మే నుంచి కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోయింది. కేవలం నాలుగు నెలల కాలంలోనే అంతర్జాతీయ చమురు ధరల వంకతో లీటరు పెట్రోలు, డీజిల్‌లపై సగటున రూ.25 వంతున పెంచింది. దీంతో కేంద్రంపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కంటి తుడుపు చర్యగా 2021 నవంబరులో లీటరు పెట్రోలు, డీజిల్‌లపై రూ.5 ధర తగ్గించింది. తాజాగా రష్యా, ఉక్రెయిన్‌ వివాదం తెర మీదికి వచ్చాక.. మరోసారి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. దీనికి తగ్గట్టుగా సాధారణ ఫ్యూయల్‌ ధరలు పెంచే అవకాశం లేకపోవడంతో వైట్‌ పెట్రోల్‌ ధరలు పెంచింది.

మరిన్ని వార్తలు