కేంద్ర ప్రభుత్వంపై చెల్లింపుల భారం రూ.133.22 లక్షల కోట్లు!

1 Jul, 2022 08:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వంపై చెల్లింపుల భారం గడచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికానికి రూ.1,33,22,727 కోట్లుగా నమోదయ్యింది. 2021 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే ఈ విలువ 3.74 శాతం పెరిగింది. విలువలో ఇది రూ.1,28,41,996 కోట్లుగా ఉంది. ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన రుణ నిర్వహణా నివేదిక ఈ గణాంకాలను విడుదల చేసింది. 

మొత్తం రుణాల్లో 92.28 శాతం పబ్లిక్‌ డెట్‌ (ఈ రుణ చెల్లింపులను కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఇండియా నుండి జరపాలి). 2021 డిసెంబర్‌ నాటికి ఇది 91.60 శాతం. డేటెడ్‌ సెక్యూరిటీలకు సంబంధించి చెల్లింపులు 6.33 శాతం నుంచి 6.66 శాతానికి చేరింది.  క్రూడ్‌ ఆయిల్‌ ధరలు త్రైమాసికంగా బ్యారల్‌కు 104.40 నుంచి 129.26 డాలర్లకు చేరిందని నివేదిక పేర్కొంది.  
 

మరిన్ని వార్తలు