Mudra Loans: రేషన్‌ షాపుల్లో ముద్రా లోన్‌ సేవలు,కేంద్రం ప్రతిపాదనలు

28 Oct, 2021 12:43 IST|Sakshi

Small Cylinders in Ration Shops:చిరు వ్యాపారులకు కేంద్రం శుభవార్త చెప్పనుంది. త్వరలో రేషన్‌ షాపుల్లో చిరు వ్యాపారులకోసం అందుబాటులోకి తెచ్చిన ముద్రాలోన్‌ సేవల్ని రేషన్‌ షాపుల్లో  ప్రారంభించేలా చర్యలు తీసుకోనుంది.

బుధవారం అంతర్ మంత్రిత్వ, అంతర్ రాష్ట్ర వర్చువల్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ఫుడ్‌ సెక్రటరీ సుధాన్షు పాండే మాట్లాడుతూ.. కేంద్రం త్వరలోనే రేషన్‌ షాపుల్లో ముద్రాలోన్లతో పాటు ఇతర ఆర్ధిక సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు తెచ్చినట్లు తెలిపారు. వీటితో పాటు రేషన్‌ షాపుల్లో 5 కేజీల ఎఫ్‌టీఎల్‌(Free trade LPG) గ్యాస్‌ అమ్మకాల్ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. ఇందు కోసం కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయిల్‌ కంపెనీలతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. 

5.32 లక్షల రేషన్ షాపులు
దేశ వ్యాప్తంగా 5.32 లక్షల రేషన్ షాపులు ఉన్నాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే 80 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుంది. అయితే త్వరలో కేంద్రం సిలిండర్ల రిటైల్ విక్రయాలతో పాటు రుణాలు,ఇతర ఆర్థిక సేవలను ప్రవేశపెట్టడం ద్వారా రేషన్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని  భావిస్తోంది. కేంద్రం నిర్వహించిన అంతర్ మంత్రిత్వ, అంతర్ రాష్ట్ర వర్చువల్ మీటింగ్‌లో పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖతో పాటు, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతినిధులు హాజరయ్యారు. రేషన్‌ వ్యవస్థను మరింత పట్టిష్టంగా మార్చే దిశగా కేంద్ర తెచ్చిన ప్రతిపాదనల్ని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతిచ్చాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

తనఖా లేకుండా 10లక్షల వరకు రుణాలు 
సామాజిక, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు, అట్టడుగు వర్గాలకు ఆర్థిక సమగ్రత, సహాయాన్ని అందించేందుకు కేంద్రం 2015 ఏప్రిల్‌ 8న ప్రధాన్‌మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. పీఎంఎంవై కింద ఎలాంటి తనఖా లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, చిన్న ఆర్థిక సంస్థలు, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్‌ కంపెనీల నుంచి రుణాలు పొందవచ్చు. వ్యవసాయం అనుబంధ సంస్థలు, తయారీ, వాణిజ్యం, సేవల రంగాలలో ఆదాయం సృష్టించే చిన్న తరహా వ్యాపారాలకు ముద్ర రుణాలను మంజూరు చేస్తారు.

చదవండి: బ్యాంకుల్లో బంపర్‌ ఆఫర్లు, లోన్ల కోసం అప్లయ్‌ చేస్తున్నారా?

మరిన్ని వార్తలు