ఐటీ హార్డ్‌వేర్‌ కోసం పీఎల్‌ఐ స్కీము

11 Jan, 2023 10:05 IST|Sakshi

హైదరాబాద్‌: మొబైల్‌ ఫోన్ల విభాగం తరహాలోనే ఐటీ సర్వర్, ఐటీ హార్డ్‌వేర్‌కు కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. అలాగే ఐటీ పీఎల్‌ఐలో దేశీయంగా డిజైన్‌ చేసిన మేథో సంపత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించే తయారీదారులకు అదనంగా ప్రోత్సాహకాలు కూడా ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. 

వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ కాన్ఫరెన్స్‌ 2023లో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. కొత్త తరం యాప్స్‌ను తయారు చేసే దిశగా ఐపీ, సాధనాలు, డివైజ్‌లను రూపొందించే స్టార్టప్‌లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు 200 మిలియన్‌ డాలర్ల ఫ్యూచర్‌ డిజైన్‌ ప్రోగ్రామ్‌ను కేంద్రం ప్రకటించిందని మంత్రి వివరించారు. గ్లోబల్‌ డిజిటలైజేషన్‌లో కొత్త ఆవిష్కరణలకు సెమీకండక్టర్ల తోడ్పాటు అనే అంశంపై అయిదు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది.

చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!

మరిన్ని వార్తలు