EPF Interest Rate For FY22: ఉద్యోగులకు షాకిచ్చిన కేంద్రం! ఈసారి పీఎఫ్‌ వడ్డీరేట్లపై..

3 Jun, 2022 19:58 IST|Sakshi

ఉద్యోగులకు కేంద్రం షాకిచ్చింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పీఎఫ్‌ వడ్డీరేట్లపై కేంద్ర ఆర్థిక శాఖ పలుసార్లు చర్చలు జరిపిన తర్వాత వడ్డీరేటును 8.1 శాతానికి పరిమితం చేస్తున్నట్టు శుక్రవారం సాయంత్రం నోటిఫై చేసింది. తగ్గించిన వడ్డీరేటు 2021-22 ఆర్థిక సంవత్సరానికి వర్తించనుంది. అంతకు ముందు ఏడాది ఈ వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది.

ఇప్పటికే బ్యాంకుల్లో వడ్డీరేట్లు తక్కువగా ఉండగా ఆఖరికి కేంద్రం కూడా వడ్డీ రేట్లు తగ్గించడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. గడిచిన నలభై ఏళ్లలో కూడా ఇదే అత్యల్ప వడ్డీరేటు. చివరి సారిగా 1977-78లో పీఎఫ్‌ వడ్డీరేటు 8 శాతంగా ఉండేది. నలభై నాలుగేళ్ల తర్వాత ఇంచుమించు అదే స్థాయికి వడ్డీరేటు పెరిగింది.

ఈ నలభై ఏళ్లలో రూపాయి విలువ గణనీయంగా క్షీణించింది. అన్నింటి ధరలు పెరిగాయి. ఇలాంటి సందర్భాల్లో కనీసం ప్రభుత్వాలపై తమ నుంచి తీసుకున్న సొమ్ముకు మంచి వడ్డీ ఇవ్వాల్సి ఉండగా దాన్ని విస్మరించి వడ్డీకి కోత పెట్టడం పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: File e-Nomination In EPF Account: ఈపీఎఫ్‌లో ఈ-నామినేషన్‌ ఫైల్‌ చేశారా! లేదంటే మీకే నష్టం!

మరిన్ని వార్తలు