ఎల్‌ఐసీ ఐపీవో.. ఈ వారంలో కేంద్రం కీలక నిర్ణయం!

22 Apr, 2022 16:11 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే అంశంపై ఈ వారంలో ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడే వీలున్నట్లు తెలుస్తోంది. మార్చి ముగిసేలోగా ఐపీవో పూర్తిచేయాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ భౌగోళిక, రాజకీయ అనిశ్చితులతో వాయిదా పడింది. 

ప్రభుత్వం ఎల్‌ఐసీలో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించే యోచనలో ఉంది. తద్వారా బీమా దిగ్గజాన్ని స్టాక్‌ ఎక్ఛేంజీలో లిస్ట్‌ చేయాలని ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇష్యూకి మే 12వరకూ గడువు ఉంది. దీంతో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయవలసిన అవసరంలేదని సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

 అయితే ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఇష్యూని చేపట్టే అంశం క్లిష్టంగా మారినట్లు తెలియజేశారు. రిటైల్, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల డిమాండు సానుకూలంగా ఉన్నప్పటికీ ఎఫ్‌పీఐలు తిరిగి పెట్టుబడుల బాటలోకి మళ్లేవరకూ వేచిచూసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు.

చదవండి👉 చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...!

మరిన్ని వార్తలు