Nirmala Sitha Raman: థర్డ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌.... పిల్లలపై కేంద్రం ఫోకస్‌

28 Jun, 2021 16:25 IST|Sakshi

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రాజెక్ట్‌కి రూ. 23,220 కోట్లు

పిల్లల వార్డుల్లో మౌలిక సదుపాయల మెరుగుకు చర్యలు

కొత్తగా పిల్లల వార్డుల ఏర్పాటుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు 

కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉండటంతో ఎమర్జెన్సీ హెల్త్‌ సిస్టమ్‌ ప్రాజెక్ట్‌ని కేంద్ర ఆర్థిక మంత్రులు నిర్మల సీతారామన్‌, అనురాగ్‌ ఠాకూర్‌లు ప్రకటించారు. ఈ పథకానికి రికార్డు స్థాయిలో రూ. 23,220 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్‌ కేర్‌పై ఎక్కువ ఫోకస్‌ చేయనున్నారు. థర్డ్‌ వేవ్‌ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపువచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఏరియా, జిల్లా స్థాయి ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా పిల్లల వార్డుల ఏర్పాటు చేయడంతో పాటు  ఇప్పటికే ఉన్న పిల్లల వార్డులో మౌలిక సదుపాయలు మెరుగుపరచడం వంటి చర్యలు యుద్ధ ప్రతిపాదికన చేపట్టనున్నారు. 

మౌలిక సదుపాయలకు నిధులు

ఈ నిధులతో 7929 కోవిడ్‌ హెల్త్‌ సెంటర్లు, 9954 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. దీంతో  ప్రస్తుతం కోవిడ్‌ కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న ఆస్పత్రుల సంఖ్యను 25 రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఉ‍న్న ఆక్సిజన్‌ బెడ్ల సంఖ్యను 7.5 రెట్లు, ఐసోలేటెడ్‌ బెడ్ల సంఖ్య 42 రెట్లు, ఐసీయూ బెడ్లు 45 రెట్లు పెంచబోతున్నారు. సబ్‌ సెంటర్‌ స్థాయి నుంచి జిల్లా ఆస్పత్రి స్థాయి వరకు ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తారు.  వైద్య విద్యార్థుల సేవలు ఉపయోగించుకునేందుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందిస్తామని మంత్రి తెలిపారు. 

అంబులెన్సుల కొనుగోలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కొరత తీర్చడంతో పాటు కొత్తగా అంబులెన్సుల కొనుగోలు, టెలి మెడికేషన్‌, కోవిడ్‌ టెస్టుల పెంపు తదితర చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించింది. 

చదవండి : 5 లక్షల టూరిస్టు వీసాలు ఫ్రీ

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు