Nirmala Sitha Raman: బ్రాడ్‌బ్యాండ్‌కి భారీగా నిధులు

28 Jun, 2021 16:48 IST|Sakshi

రూ.19,041 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి

వేగంగా జరగనున్న భారత్‌ నెట్‌ పనులు 

దేశంలో ఇంటర్నెట్‌ బ్రాడ్‌బాండ్‌ కనెక్టివీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్‌ నెట్‌ పథకానికి భారీగా నిధులు కేటాయించారు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌. ఇప్పటికే అమలవుతున్న ఈ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆమె ప్రకటించారు. 

ఇంటర్నెట్‌తో కోవిడ్‌ పోరు
టీకా వేయించుకోవాలనుకునే వారు కోవిన్‌ యాప్‌ ద్వారా రిజిస్ట్రర్‌ చేసుకోవాలంటూ కేంద్రం ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇంటర్నెట్‌ సౌకర్యం లేని మారుమూల ప్రాంత ప్రజలు ఎలా రిజిస్ట్రర్‌ చేసుకుంటారంటూ ప్రతిపక్షలు ఘాటుగా విమర్శించాయి. మరోవైపు టెలి మెడిసిన్‌పై కూడా ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివి పెంచడం లక్ష్యంగా ఉద్దేశించిన భారత్‌నెట్‌కు భారీగా నిధులు కేటాయించింది.


రూ. 19,041 కోట్లు
భారత్‌ నెట్‌ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఈ పథకానికి అప్పుడు రూ. 42,048 కోట్లు కేటాయించారు. తాజాగా రూ.19,041 కోట్లు అదనంగా జత చేశారు. దీంతో ఈ పథకం మొత్తం విలువ రూ. 61,109 కోట్లకు చేరుకుంది.

మారుమూల ప్రాంతాలకు  నెట్‌
భారత్‌నెట్‌ ద్వారా దేశంలో ఉన్న 2,50,000 లక్షల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌ బాండ్‌ కనెక‌్షన్‌ అందివ్వడం లక్ష్యంగా నిర్దేశించారు. 2021 మే 31 నాటికి 1,56,223 గ్రామ పంచాయతీలకు నెట్ కనెక‌్షన్‌ అందించారు. 

చదవండి : థర్డ్‌ వేవ్‌ ఎఫెక్ట్‌.... పిల్లలపై కేంద్రం ఫోకస్‌

మరిన్ని వార్తలు