వర్క్‌ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు

9 Dec, 2022 11:36 IST|Sakshi

న్యూఢిల్లీ: వర్క్‌ ఫ్రం హోం వెసులుబాటునుంచి ఆఫీసులకు వెడుతున్న పలు స్పెషల్ ఎకనామిక్ జోన్ల(సెజ్‌)లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దేశంలోlr ప్రత్యేక ఆర్థిక మండళ్ల యూనిట్లలో ఉన్న ఐటీ,  ఐటీ ఆదారిత కంపెనీల్లోని 100 శాతం మంది ఉద్యోగులకు ఇంటి నుండి పూర్తి పనిని అనుమతించింది. 

వచ్చే ఏడాది డిసెంబరు (2023 డిసెంబర్) వరకు ఇంటినుంచే పనిచేసుకోవచ్చు. దీనికి సంబంధించి వాణిజ్య మంత్రిత్వ శాఖ కొన్ని షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.  మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఒక యూనిట్ తన ఉద్యోగులను ఇంటి నుండి లేదా  సెజ్‌ వెలుపల ఏ  ప్రదేశం నుండైనా పనిచేసుకోవడానికి అనుమతించవచ్చు. ప్రస్తుతానికి సెజ్‌లలో మొత్త ఉద్యోగుల్లో సగం మంది,  గరిష్టంగా ఒక సంవత్సరం పాటు ఇంటి నుండి పని చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే. 

సెజ్‌లలోని యూనిట్ యజమానులు సంబంధిత జోన్‌ల డెవలప్‌మెంట్ కమిషనర్‌కు సమాచారం  అందించి సంబంధిత ఆమోద  పత్రం  పొందాలి. భవిష్యత్తులో ఇంటి నుండి పని ప్రారంభించాలనుకునే యూనిట్లు ఇంటి నుండి పని ప్రారంభించే తేదీకి లేదా ముందు మెయిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరెవరు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారనేది  బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు.ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడానికి ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు లేదా ఇతర పరికరాలను అందించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.  సదరు యూనిట్‌ ఉత్పత్తి చేసే ఉత్పత్తుల ఎగుమతి ఆదాయాన్ని  సంబంధిత యూనిట్  ఉద్యోగి నిర్ధారించాల్సి ఉంటుందని  కూడా మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు