నేచురల్‌ గ్యాస్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. తగ్గనున్న పీఎన్‌జీ,సీఎన్‌జీ గ్యాస్‌ ధరలు

7 Apr, 2023 07:41 IST|Sakshi

సహజ వాయివు (నేచురల్‌ గ్యాస్‌) ధరల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేచురల్‌ గ్యాస్‌ ధరల్ని నియంత్రించేందుకు కొత్త పద్దతిని అమలు చేసింది. 

చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ను ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో పీఎన్‌జీ, సీఎన్‌జీ గ్యాస్‌ ధరలు మరింత తగ్గన్నాయి. 

సాధారణంగా కేంద్రం యూఎస్‌, కెనడా, రష్యాతో పాటు మిగిలిన దేశాల్లో గ్యాస్‌ ట్రేడింగ్‌ హబ్‌ల్లోని ధరలకు అనుగుణంగా సహజ వాయివు ధరల్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చుతూ వచ్చేది. కానీ ఇంధనం ధరల్ని ముడిచమురు ధరలతో అనుసంధానం చేయడంతో.. ధరల్లో ప్రతినెలా మార్పులు ఉండబోతున్నాయి..


తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) 10 శాతం చౌకగా మారుతుందని, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధర 6 శాతం నుండి 9 శాతానికి తగ్గుతుందని చమురు కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదంపై శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. 

మరిన్ని వార్తలు