పీవోఎస్, యూపీఐ లావాదేవీలకు ప్రోత్సాహకాలు

17 Jan, 2023 06:09 IST|Sakshi

నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: పాయింట్‌ ఆఫ్‌ సేల్, ఈ కామర్స్‌ సంస్థలకు రూపే డెబిట్‌ కార్ట్‌తో చేసే చెల్లింపులు, వరక్తుల వద్ద భీమ్‌ యూపీఐ ప్లాట్‌ఫామ్‌ సాయంతో చేసిన తక్కువ విలువ లావాదేవీలకు ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌ ఉంచారు. రూపే కార్డు, భీమ్‌ యూపీఐ లావాదేవీ రూ.2,000లోపున్న వాటిపై ఈ ప్రోత్సాహకాలు అందనున్నాయి.

పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషిన్లపై, ఈ కామర్స్‌ సైట్లపై రూపే డెబిట్‌ కార్డుతో చెల్లింపులు చేసినప్పుడు.. స్వీకరించే బ్యాంకులకు 0.4 శాతం, గరిష్టంగా రూ.100 ప్రోత్సాహకంగా లభిస్తుంది. భీమ్‌ యూపీఐ ఆధారిత లావాదేవీలపై చెల్లింపులను స్వీకరించే బ్యాంకులకు 0.25 ప్రోత్సాహకం లభిస్తుంది. ఇవి రిటైల్‌ చెల్లింపులకు సంబంధించినవి. అలా కాకుండా ఇన్సూరెన్స్, మ్యూచువల్‌ ఫండ్స్, ప్రభుత్వం, విద్య, రైల్వే తదితర రంగాల్లోని లావాదేవీలపై ప్రోత్సాహకాలు భిన్నంగా ఉన్నాయి. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఈ ప్రోత్సాహకాలు ఏడాది పాటు అమల్లో ఉంటాయి. గరిష్టంగా రూ.2,600 కోట్లను ఈ ప్రోత్సాహకాల కోసం కేంద్రం కేటాయించింది.

మరిన్ని వార్తలు