Nirmala Sitha Raman: 5 లక్షల టూరిస్టు వీసాలు ఫ్రీ

28 Jun, 2021 15:48 IST|Sakshi

పర్యాటక రంగానికి ఊతం

క్యాపిటల్‌ , పర్సనల్‌ లోన్లు 

ప్రకటించిన నిర్మల సీతారామన్‌ 

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు 5 లక్షల టూరిస్టు వీసాలను ఉచితంగా జారీ చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్‌ ప్రకటించారు.  కోవిడ్‌కి ముందు 2019లో సుమారు 1.93 కోట్ల మంది టూరిస్టులు ఇండియాకు వచ్చేవారన్నారు. వీరి వల్ల దేశంలో 30 బిలియన్‌ డాలర్ల వ్యాపారం జరిగిందన్నారు. మరోసారి విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు ఫ్రీ వీసాను అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. ఈ పథకం 2022 మార్చి 30 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ముందుగా వచ్చిన 5 లక్షల మంది విదేశీ టూరిస్టులకు ఈ పథకం వర్తింస్తుందన్నారు. ఒక వ్యక్తికి ఒకే సారి ఉచితంగా వీసా జారీ చేస్తామన్నారు. 

పర్సనల్‌ లోన్లు
కోవిడ్‌తో దెబ్బతిన్న టూరిజం రంగాన్ని ఆదుకునేందుకే వర్కింగ్‌ క్యాపిటల్‌, పర్సనల్‌ లోన్లు అందిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ముఖ్యంగా టూరిజం రంగంలో ఉన్న హోటళ్లు, ట్రావెల్‌ ఏజెన్సీలు, గైడ్లను  ఆదుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రర్‌ చేసుకున్న  10,700ల మంది గైడ్స్‌,  904 ట్రావెల్‌ టూరిజం స్టేక్‌ హోల్డర్లకు రుణాలు, ఆర్థిక సాయాన్ని రుణంగా అందిస్తామన్నారు. ట్రావెల్‌ టూరిజం స్టేక్‌హోల్డర్లకు రూ. 10 లక్షల రుణం అందిస్తామన్నారు. దీంతో పాటు టూరిస్ట్‌ గైడులకు లక్ష రూపాయల వ్యక్తిగత రుణం అందిస్తామన్నారు. కేంద్ర టూరిజం శాఖ ద్వారా ఈ పథకం అమలు చేయబోతున్నట్టు మంత్రి వివరించారు. 
 

మరిన్ని వార్తలు