గనుల రంగంలో విప్లవాత్మక సంస్కరణలు!

9 Sep, 2021 02:31 IST|Sakshi

మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడి

న్యూఢిల్లీ: గనుల రంగంలో విప్లవాత్మక  సంస్కరణలు తీసుకురావడానికి కేంద్రం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. మరో వారంలో సంబంధిత వర్గాల సలహాలను ఆహా్వనిస్తుందని  వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా నవంబర్‌లో జరిగే పార్లమెంటు సమావేశాల్లో మైనింగ్‌ చట్టాలకు కేంద్రం సవరణలు తీసుకువస్తుందని కూడా వెల్లడించారు. 

రాష్ట్ర ప్రభుత్వాలకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ)  100 జీ4 ఖనిజ క్షేత్రాల బదలాయింపు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి ప్రహ్లాద్‌ మాట్లాడారు. గనులు, ఖనిజాల అంశాల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఖనిజ క్షేత్రాలను వేలానికి తీసుకురావాలని రాష్ట్రాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు 100 ఖనిజ క్షేత్రాల కేటాయింపు వల్ల దేశంలో సంబంధిత సరఫరాలు నిరంతరం పెరుగుతాయని, ఖనిజ క్షేత్రాల వేలం ద్వారా రాష్ట్రాలకు ఆదాయం వస్తుందని తెలిపారు.

మరిన్ని వార్తలు