ఆ గనులు మాకిచ్చేయండి.. వాడనప్పుడు మీ దగ్గర ఎందుకు - కేంద్రం

8 Apr, 2022 19:59 IST|Sakshi

తమకు కేటాయించిన గనుల్లో ఇప్పటి వరకు కార్యకలాపాలు ప్రారంభినట్టయితే ఎటువంటి జరిమానా లేకుండా వాటిని తిరిగి ఇవ్వాలంటే కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు ఉత్పత్తి సంస్థలకు తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కెబినేట్‌ కమిటీ ఆన్‌ ఎకామికల్‌ ఎఫైర్స్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనేక సంస్థలు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో కోలిండియా పరిధిలో 9 సంస్థలు ఉండగా దక్షిణ భారత దేశంలో సింగరేణితో పాటు నైవేలీ కోల్‌ఫీల్డ్స్‌ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు గతంలో కేంద్రం పలు బ్లాకులను బొగ్గు ఉత్పత్తి కోసం కేటాయించింది. 

వివిధ కారణాల వల్ల చాలా సంస్థలు తమకు కేటాయించిన బ్లాకులలో బొగ్గును ఉత్పత్తి చేయడం లేదు. కొన్ని బ్లాకులకు ఫీజుబులిటీ లేకపోవడం వంటి సమస్యలు ఉండగా మరికొన్ని బ్లాకులకు ఫారెస్ట్‌ అనుమతులు, నిధుల కొరత, భూసేకరణ తదితర సమస్యలు ఉన్నాయి. ఇలా మొత్తం 73 బ్లాకులు కేటాయించగా ఇందులో 45 బ్లాకులతో ఉత్పత్తి జరగడం లేదు.

ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో కరెంటు ఉత్పత్తి తగ్గిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిరుపయోగంగా ఉన్న బొగ్గు బ్లాకులను తిరిగి తమకు సరెండర్‌ చేయాలని కేంద్రం కోరింది. ఇలా సరెండర్‌లో వచ్చిన బ్లాకులను ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలకు కేటాయించనున్నారు. ఈ స్వచ్చంధ సరెండ్‌ పథకం కింద బొగ్గు బ్లాకులు కేటాయించే సంస్థలకు పెనాల్టీ, వివరణల నుంచి మినహాయింపు ఇచ్చారు. 

చదవండి: కియాకు మరిన్ని మెరుగులు.. కొత్త ఫీచర్లు ఇవే!

మరిన్ని వార్తలు