అమ్మకానికి కోల్‌ ఇండియా వాటాలు, కేంద్రం మరో కీలక నిర్ణయం?

25 Nov, 2022 18:43 IST|Sakshi

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంతో కేంద్రానికి దిగుమతుల ఖర్చు, రాయితీల భారం పెరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన  వాటాల్ని అమ్మగా వచ్చిన మొత్తంతో వాటిని సర‍్ధు బాటు చేసేందుకు సిద్ధమైంది. 

ఈ నేపథ్యంలో కోల్‌ ఇండియా, హిందుస్తాన్‌ జింక్‌, రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్‌ సంస్థలకు చెందిన 5 నుంచి 10 శాతం వాటాను విక్రయించనుందని, వాటిలో కొన్ని షేర్లని ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మెకానిజం ద్వారా సేల్‌ చేయనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక తెలిపింది.అమ్మే ఈ కొద్ది మొత్తం వాటాతో సంబంధిత సంస్థల షేర్లు లాభాల్లో పయనించడంతో పాటు ఫైనాన్షియల్‌ ఇయర్‌ చివరి త్రైమాసికం సమయానికి ఆర్ధికంగా వృద్ధి సాధించ వచ్చని కేంద్రం భావిస్తున్నట్లు  బ్లూమ్‌ బెర్గ్‌ నివేదిక పేర్కొంది.

16500 కోట్లు 
ఇక ప్రభుత్వ రంగం సంస్థల్లోని వాటాల్ని అమ్మగా రూ.16500 కోట్లు సమకూరున్నట్లు సమాచారం. ఇప్పటికే వాటాల విక్రయాలపై కేంద్రం కేబినెట్‌ ఈ ఏడాది మేలో ఆమోదం తెలపగా..వాటాల విక్రయాన్ని వేగ వంతం చేస్తోంది.

ఆఫర్‌ ఫర్‌ సేల్‌ 
డిజ్‌ఇన్వెస్ట్‌ మెంట్‌ ప్లాన్‌లో భాగంగా కోల్‌ ఇండియా,ఎన్‌టీపీసీ, హిందుస్తాన్‌ జింక్‌, రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌, ఎకనామిక్స్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐటీఈఎస్‌) వాటాల్ని ఆఫర్‌ ఫల్‌ సేల్‌కు పెట్టనుంది. 

10-20శాతం వాటాల విక్రయం
పలు నివేదికల ప్రకారం.. రాష్ట్రియ కెమికల్స్‌ ఫర్టిలైజర్స్‌, నేషనల్‌ ఫర్టిలైజర్స్‌ సంస్థల వాటాల్ని 10 నుంచి 20 శాతం వరకు అమ్మనున్నట్లు సమాచారం. 

టార్గెట్‌ రూ.65 వేల కోట్లు 
పెట్టుబడుల ఉపసంహరణ (డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌) ద్వారా 2023-2024 సమయానికి మొత్తం రూ.65వేల కోట్లను సేకరించేలా కేంద్రం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం ఫైనాన్షియల్‌ ఇయర్‌లో డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌ ద్వారా మొత్తం రూ.24వేల కోట్లు సమకూరినట్లు డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మేనేజ‍్మెంట్‌ (దీపం)వెబ్‌సైట్‌ పేర్కొంది. 

అనిల్‌ అగర్వాల్‌ చేతిలో
2002లో నాటి కేంద్ర ప్రభుత్వం హిందుస్తాన్‌ జింక్‌ 26 శాతం వాటాని వేదాంత గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌కు విక్రయించింది. ఆ తర్వాత అదే సంస్థకు చెందిన భారీ మొత్తంలో వాటాను కొనుగోలు చేశారు.  ఆ మొత్తం వాటా కలిపి 64.92శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు