గుడ్‌న్యూస్‌ : నష్టపరిహారం చెల్లింపు చట్టంలో మార్పులు

19 Jun, 2021 17:28 IST|Sakshi

30 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాలి

లేదంటే 12 శాతం వడ్డీ చెల్లించాల్సిందే

కొత్త ముసాయిదా సిద్ధం చేస్తోన్న కేంద్రం 

న్యూఢిల్లీ : కార్మికుల అండగా ఉండేందుకు సామాజిక భద్రత ( నష్టపరిహారం) రూల్స్‌లో మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు అనేక కీలక మార్పులకు సంబంధి ముసాయిదా సిద్ధం చేస్తోంద. ఇందులో కార్మికుల నష్టపరిహారం చెల్లింపు విషయంలో కార్మికులకు సత్వర న్యాయం జరిగే విధంగా ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పులు తేనున్నారు.

30 రోజుల్లో...
ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాల ప్రకారం ఏదైనా కార్మికుడు పని ప్రదేశంలో గాయపడినా, చనిపోయినా 30 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాంటూ నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ నిబంధన సరిగానే అమలవుతోన్న ప్రైవేటు కంపెనీల్లో చాలా సార్లు నష్టపరిహారం చెల్లింపు విషయంలో ఆలస్యం జరుగుతోంది. దీని వల్ల కార్మికులు నష్టపోతున్నారు. కొత్త ముసాయిదా చట్టంలో ఈ ఆలస్యాన్ని నివారించి కార్మికులకు మేలు జరిగేలా మార్పు చేశారు.

12 శాతం వడ్డీతో
ప్రస్తుతం ముసాయిదా చట్టంగా అమల్లోకి వస్తే గాయపడిన లేదా మరణించిన కార్మికుడికి కంపెనీ లేదా యజమాని 30 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించని పక్షంలో నష్టపరిహారంగా అందె మొత్తం పైనా 12 శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త మార్పులు కార్మికులకు ఉపయుక్తంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 

చదవండి : హ్యుందాయ్ సరికొత్త ఎస్‌యూవీ‘ అల్కజార్’
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు