భద్రావతి స్టీలు ప్లాంటుకు బిడ్లు కరువు 

13 Oct, 2022 13:05 IST|Sakshi

ప్రైవేటీకరణ ప్రతిపాదన ఉపసంహరణ

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థ సెయిల్‌కు చెందిన భద్రావతి స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణ ప్రతిపాదనను ప్రభుత్వం ఉప సంహరించింది.  తగినంత స్థాయిలో బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తం కాకపోవడమే ఇందుకు కారణం.

కర్ణాటకలోని భద్రావతిలో ఉన్న విశ్వేశ్వరాయ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంటు (వీఐఎస్‌పీ)లో సెయిల్‌కి ఉన్న 100 శాతం వాటాలను విక్రయించేందుకు 2019 జులైలో ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానించారు. దీనికి స్పందనగా పలు ఈవోఐలు వచ్చాయని, సంస్థ వివరాలను బిడ్డర్లు మదింపు కూడా చేశారని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం దీపం వెల్లడించింది. అయినప్పటికీ ఈ విషయంలో ముందుకెళ్లేందుకు అవసరమైనంత స్థాయిలో బిడ్డర్లు ఆసక్తి చూపలేదని పేర్కొంది. దీంతో ప్రత్యామ్నాయ మెకానిజం (సాధికారిక మంత్రుల బృందం) ఆమోదం మేరకు ఈవోఐని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దీపం వివరించింది.

మరిన్ని వార్తలు