Sri Lanka Crisis: బాంబు పేల్చిన ఎలన్‌ మస్క్‌!

15 Apr, 2022 15:55 IST|Sakshi

ఎలన్‌ మస్క్‌ కాదు కాదు.. సైక్లోన్‌ మస్క్‌(ట్విటర్‌ యూజర్లు ముద్దుగా పెట్టిన పేరు) ట్విట్టర్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తన వద్ద ప్లాన్‌ బి ఉందంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈ బిజినెస్‌ టైకూన్‌ ట్విటర్‌ కొనుగోలు అంశం హాట్‌ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌ యూజర్లు శ్రీలంకను అప్పుల్లో నుంచి గట్టెక‍్కించాలని సైక్లోన్‌ మస్క్‌ను విజ్ఞప్తి చేస్తున్నారు. 

ట్విటర్‌లో ఎలన్‌ మస్క్‌ అతిపెద్ద వాటాదారుడు. లాభపేక్షతో సంబంధం లేకుండా ట్విటర్‌కు చెందిన ఒక్కో షేర్‌ను 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని బంపరాఫర్‌ ప్రకటించారు. తద్వారా 43 బిలియన్‌ డాలర్లు (రూ.3.22లక్షల కోట్లు) చెల్లిస్తామని ఆఫర్‌ చేశారు. కానీ మస్క్‌ ఆఫర్‌ను ట్వీటర్‌ యాజమాన్యం తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

అందుకు ఎలాగైనా ట్వీటర్‌ను దక్కించుకునేందుకు 'ప‍్లాన్‌-బి'ని అమలు చేస్తానని కెనడాలోని వాంకోవా నగరంలో జరిగిన టెడ్‌-2020 సమావేశంలో ఎలన్‌ మస్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'హోస్టైల్‌ టేకోవర్‌'తో ట్వీటర్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే ఆ సంస్థ బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టెర్‌తో సంబంధం లేకుండా షేర్‌ హోల్డర్స్‌ను ఒప్పించి ట్వీటర్‌ను చేజిక్కించుకోవచ్చు. ఇదే ఎలన్‌ ప్లాన్‌-బి' అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అదే సమయంలో ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌కు ఇచ్చిన ఆఫర్‌పై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ ట్రెండ్‌ అవుతున్నాయి. కానీ ఓ వర్గానికి చెందిన యూజర్లు మాత్రం పీకల్లోతు అప్పుల్లో (53 బిలియన్‌ డాలర్లు) ఉన్న శ్రీలంకను గట్టెక్కించాలని కోరుతున్నారు. 

స్నాప్‌ డీల్‌ సీఈఓ కునాల్‌ బాల్‌..ఎలన్‌ మస్క్‌ ట్వీటర్‌కు 43 బిలియన్‌ డాలర్లను ఆఫర్‌ చేశారు. అదేదో  45 బిలయన్‌ డాలర్లతో శ్రీలంకను కొనుగోలు చేసి తనని తాను సైక్లోన్‌ మస్క్‌గా పిలిపించుకోవచ్చు కదా అంటూ ఓ స్మైల్‌ మీమ్‌ను యాడ్‌ చేశారు. 

మరో ట్వీటర్‌ యూజర్‌ శ్రేయాసీ గోయెంకా..43 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మరో 8 బిలియన్‌ యాడ్‌ చేసి శ్రీలంకను అప్పుల్లో నుంచి బయపడేసి సైక‍్లోన్‌ మస్క్‌గా పేరు మార్చుకోవచ్చు కదా అని ట్వీట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆ ట్వీట్‌లో వైరల్‌ అవుతున్నాయి. మీకోసం ఆ ట్వీట్‌లు.

చదవండి: ట్విటర్‌పై ఎలన్‌మస్క్‌ దండయాత్ర.. ఈసారి ఆ రూట్‌లో..

మరిన్ని వార్తలు