మేం రెడీ: ఆల్ట్‌మాన్‌కు  సీపీ గుర్నానీ చాలెంజ్‌, ఏం జరిగిందంటే!

10 Jun, 2023 14:27 IST|Sakshi

చాట్‌జీపీటీ టూల్‌ భారత్‌ వల్ల  కాదు: ఏఐ ఆల్ట్‌మాన్‌

భారత  పారిశ్రామికవేత్తలను తక్కువ అంచనా వేయొద్దు!  

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మన్  సిలికాన్‌ వ్యాలీతో భారతీయ నిపుణులు  పోటీ  పడలేరన్న వ్యాఖ్యలపై టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ స్పందించారు. భారతీయ కంపెనీలు తమ సిలికాన్ వ్యాలీ కౌంటర్‌ పార్ట్‌లతో పోటీ పడలేరన్న ఆల్ట్‌మాన్‌ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు.

భారతదేశంతో సహా ఆరు దేశాల పర్యటనలో ఉన్న ఆల్ట్‌మాన్‌ను ఇండియాలో చాలా పవర్‌ ఫుల్‌ ఎకోసిస్టం ఉంది. ప్రత్యేకంగా ఏఐపై దృష్టి పెడుతున్నాం, కానీ చాట్‌జీపీటీ లాంటి కృత్రిమ మేధస్సు సాధనాన్ని ఇండియా, ఆగ్నేయాసియాలో తయారు చేయగలదా అని మాజీ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ అడిగినపుడు  ఈ వ్యాఖ్యలు చేశారు. (వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎలాన్‌ మస్క్‌: ఇక డబ్బులే డబ్బులు!)  

"ఇది ఎలా పని చేస్తుందో మీకు చెప్పబోతున్నాం, ట్రైనింగ్‌ ఫౌండేషన్ మోడల్స్‌పై పోటీ పడటం పూర్తిగా ప్రయోజనం లేనిది, ఆఫ్‌కోర్స్‌.. ఎలాగైనా ప్రయత్నించడం మీ జాబ్‌ అయినా కానీ వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉందడని సమాధానమిచ్చాడు. (1200 లోన్‌తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు)

ఆల్ట్‌మాన్ వ్యాఖ్యలను పూర్తి తిప్పికొడుతూ గుర్నానీ ట్వీట్ చేశారు. ఒక సీఈవోకి మరో సీఈవోకి ఇచ్చిన సవాలును స్వీకరిస్తున్నానంటూ ప్రతి సవాల్‌  విసిరారు. మరోవైపు చాట్‌జిపిటి వంటి టూల్‌ను రూపొందించే సామర్థ్యం భారత్‌కు లేదని ఆల్ట్‌మాన్ పేర్కొన్నప్పటికీ, భారతీయ పారిశ్రామికవేత్తలు తమ సొంత సాధనాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తారని ఆనందన్   కూడా ట్వీట్ చేశారు. అంతేకాదు 5000 సంవత్సరాల భారతీయ వ్యవస్థాపకత, భారతీయ పారిశ్రామిక వేత్తలను మనం ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దు,  తామూ ప్రయత్నించాలనుకుంటున్నామన్నారు.   

మరిన్ని వార్తలు