2022లో చంద్రయాన్‌-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్

14 Mar, 2021 18:25 IST|Sakshi

'ఫ్యూచర్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ ఏవియానిక్స్ ఇన్ ఇండియా' అనే అంశంపై యుపీఈఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన సమావేశంలో ఇస్రో చైర్మన్, కార్యదర్శి డాక్టర్ కే.శివన్‌ ప్రసంగించారు. ఈ సమావేశంలో డాక్టర్ కే.శివన్ రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రణాళిక గురించి మాట్లాడారు. అతను పేర్కొన్న ప్రాజెక్టులలో ఇస్రో యొక్క చంద్రయాన్-3 (మూన్ మిషన్ 3), ప్రతిష్టాత్మక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం(గగన్ యాన్) ఉన్నాయి. "తరువాతి దశాబ్దకాలంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనంతో సహా అనేక అధునాతన సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకుంది. హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనం 16-టన్నుల పేలోడ్లను జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ కక్ష్యకు తీసుకువెళ్ళగలదు. ఇది ప్రస్తుత జీఎస్ఎల్వీ ఎంకే3 లిఫ్ట్ సామర్థ్యానికి నాలుగు రెట్లు ఎక్కువ, అలాగే పునర్వినియోగపరిచే ప్రయోగ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు” చైర్మన్ డాక్టర్ కే.శివన్ పేర్కొన్నారు.

చంద్రయాన్-2 లోపాలను గుర్తించి తదుపరి మిషన్ లో అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండటానికి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము. చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2022 మొదటి భాగంలో చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. గగన్‌యాన్ రూపకల్పన చివరి దశలో ఉంది అన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మానవరహిత మిషన్ ట్రయల్ జరుగుతుంది అని కే.శివన్‌ తెలిపారు. రాబోయే కాలంలో ఇస్రో ప్రణాళికలను వివరిస్తూ జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్(జీటీఓ)కు పేలోడ్ సామర్ధ్యాన్ని 5 టన్నులకు పెంచేలా ప్రయోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీ-క్రియో ఇంజన్లు శక్తివంతమైనవని, పర్యావరణ అనుకూలమైనవని, తక్కువ ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు. మరింత శక్తివంతమైన బూస్టర్ దశల అవసరాన్ని శివన్ ప్రస్తావించారు. మరింత శక్తివంతమైన 2000 న్యూటన్ లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్ ఇంజన్ల పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. 

చదవండి:

దేశంలో ఫ‌స్ట్ ఏసీ రైల్వే ట‌ర్మిన‌ల్

కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్!

>
మరిన్ని వార్తలు