‘భయమేస్తోంది’.. చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్‌ ఆల్ట్‌మన్‌ సంచలన వ్యాఖ్యలు

18 Mar, 2023 20:16 IST|Sakshi

చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్‌ ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్‌మ‌న్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందంటూ ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు. 

చాట్‌జీపీటీ పట్ల మేం జాగ్రత్తగా ఉండాలి. దాని వినియోగంపై యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో భయపడుతున్నారని ఆల్ట్‌మాన్‌ తెలిపారు. ఎందుకంటే టెక్నాలజీ ఎంత శక్తివంతమైందో అంతే ప్రమాదకరమైందని వ్యాఖ్యానించారు.  

చాట్‌జీపీటీ, బింగ్ ఏఐ వంటి టూల్స్‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. వీటి ఫ‌లితంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళ‌న నెలకొందంటూ ఏబీసీ ప్రతినిధులు ఓపెన్‌ ఏఐ సీఈవోని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా..‘నిజమే! ఇది కొంచెం ఆందోళన కలిగించే విషయమే. మీరు నమ్ముతారో లేదో నేను ఈ జాబ్‌ (ఓపెన్‌ఏఐ సీఈవోగా) చేస్తున్నందుకు సంతోషంగా లేను అని ప్రతి స్పందించారు. 

అంతేకాదు రానున్న రోజుల్లో చాట్‌జీపీటీ వల్ల ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయి. టెక్నాలజీ వృద్ది సాధించే కొద్దీ మనిషి చేసే పనులు టెక్నాలజీలే చేస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాలకు చెందిన కంపెనీలు ఆర్ధిక మాంద్యం దృష్ట్యా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని రంగాల్లో చాట్‌జీపీటీలను వినియోగిస్తున్న సందర్భాల్ని ఉదహరించారు. తద్వారా ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇదే నిజం. అయితే తాను చాట్‌జీపీటీని డెవలప్‌ చేయడానికి కారణం మాత్రం మనుషుల జీవన విధానాన్ని మరింత మెరుగు పరిచేందుకే.కానీ టెక్నాలజీ కంటే మానువుడు ఎప్పుడూ ముందంజలో ఉంటారని’ పేర్కొన్నారు. 

చాట్‌జీపీటీ వల్ల విద్యా రంగంలో మార్పులు, విద్యార్ధుల్లో సోమరితనాన్ని ప్రోత్సహిస్తుందా?’ ఇలా అనేక విషయాల గురించి చర్చించారు. భవిష్యత్‌లో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. సాంకేతిక రంగం విషయంలో గతంలో ఇది చాలా సార్లు జరిగింది. ఉదాహరణకు..కాలిక్యులేటర్‌ వినియోగంలోకి వచ్చిన తర్వాత మ్యాథ్స్‌ సబ్జెట్‌ను బోధించే విధానం, విద్యార్థులకు పరీక్షించే విధానం పూర్తిగా మారిపోయింది’ అని ఓపెన్‌ ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు