అదరగొడుతున్న చాట్‌జీపీటీ కొత్త ఫీచర్స్ - వీడియో

26 Sep, 2023 21:14 IST|Sakshi

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి శర వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికె ప్రపంచ దేశాల్లో అత్యంత పాపులర్ అయిన ఏఐ చాట్‌జీపీటీలో ఇప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం చాట్‌జీపీటీ ఇకపై వినటమే కాదు ఫోటోల రూపంలో సలహాలను కూడా ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ఓపెన్ఏఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇప్పటి వరకు టెక్స్ రూపంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేది. అయితే మధ్యలో ఏదైనా అడగాలంటే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా ఇది కూడా సాధ్యమవుతుంది. అంటే చాట్‌జీపీటీ ఏదైనా సమాధానం చెప్పే సమయంలో మధ్యలో మనం కల్పించుకోవచ్చు, దానికి కూడా చాట్‌జీపీటీ సమాధానం ఇస్తుంది.

ఇప్పటి వరకు ఏదైనా ప్రశ్న అడగాలంటే మొత్తం టెక్స్ట్ రాయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు సమస్యకు సంబంధించిన ఫోటో షేర్ చేసి సమస్య చెబితే దానికి చాట్‌జీపీటీ సమాధానం చెబుతుంది. ఇక్కడ కనిపించే వీడియోలో మీరు గమనించినట్లయితే సైకిల్ సీటు తగ్గించడానికి ఏమి చేయాలి అని ఫోటో అప్లోడ్ చేసి అడిగితే చాట్‌జీపీటీ దానికి ఆన్సర్ చెబుతుంది. 

ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. పండుగ సీజన్‌లో 5 లక్షల ఉద్యోగాలు!

ఈ కొత్త ఫీచర్స్ మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అయితే వాయిస్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ ఫోటో ఫీచర్ అనేది అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు