Today Gold And Silver Prices: తగ్గిన బంగారం, భారీగా తగ్గిన వెండి ధర

7 Jun, 2022 19:39 IST|Sakshi

సాక్షి,ముంబై: గ్లోబల్‌ మార్కెట్ల సంకేతాలు, యూఎస్‌ బాండ్‌ ఈల్డ్స్‌ పుంజుకున్న నేపథ్యంలో మంగళవారం దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అటు మరో విలువైన మెటల్‌ వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఈ వారం చివర్లో అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. 

ఎంసీఎక్స్‌లో బంగారం10 గ్రాముల ధర రూ. 50,862గా ఉండగా, వెండి కిలో ధర 61,830కి చేరుకుంది. అటు హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్స్‌ పసిడి ధర 270 రూపాయలు తగ్గి  51,930గా ఉంది. వెండి కిలో ధర సుమారు 800 రూపాయలు తగ్గి రూ. 67770 పలుకుతోంది.

గ్లోబల్ మార్కెట్లలో పసిడి ఔన్సు ధర 1842 డాలర్ల వద్ద వారం కనిష్టానికి చేరింది. వెండి 0.6 శాతం పడి 21.92 డాలర్లుగా ఉంది. గత నెలకు సంబంధించి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.5శాతంగా ఉండొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా వేస్తుండగా, 6శాతానికి పైనే నమోదు కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా అధిక చమురు ధరల రూపంలో రిస్క్‌ ఉంటుందని అంచనా.

పెరుగుతున్న ఇంధన ధరలు, ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతుల అనిశ్చితి, ఉత్తర కొరియా టెన్షన్‌లాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు ప్రపంచవృద్ధి ఆందోళనల మధ్య పసిడి ధర 1850 డాలర్లు సమీపంలో కదలాడవచ్చని, అయితే అమెరికా డాలర్ బలం  గోల్డ్‌ ధరలపై ఒత్తిడిని కొనసాగుతుందని కోటక్ సెక్యూరిటీస్‌లోని విపి- హెడ్ కమోడిటీ రీసెర్చ్ రవీంద్ర రావు అన్నారు.

మరిన్ని వార్తలు