రూ. 700లకు థార్ అడిగిన బుడ్డోడు.. ఫ్యాక్టరీకే వెళ్ళాడు - ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?

3 Feb, 2024 18:29 IST|Sakshi

కొన్ని రోజులకు ముందు చీకు అనే బుడ్డోడు మహీంద్రా కంపెనీకి చెందిన థార్ SUVను రూ. 700కి కొనాలని ప్లాన్ చేస్తున్న ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్‌పర్సన్ 'ఆనంద్ మహీంద్రా'ను ఎంతగానో ఆకర్శించింది. 700 రూపాయలకు థార్ కొనలేవని స్పష్టం చేసిన ఆనంద్ మహీంద్రా పూణేలోని చకన్‌లోని తమ ప్లాంట్‌ని సందర్శించమని పేర్కొన్నాడు.

చీకు చకాన్‌కి వెళ్తున్నాడు అనే ట్యాగ్‌తో ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. 2.4 నిమిషాల నిడివిగల వీడియోలో థార్ కారులోనే చీకు పూణేలోని చకన్‌లోని మహీంద్రా తయారీ కర్మాగారం చేరుకుంటాడు. ప్లాంట్ సిబ్బంది ఆ పిల్లాడికి ప్రవేశద్వారం వద్ద పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.

ఫ్యాక్టరీలోకి ప్రవేశించే సమయంలో హెల్మెట్ ధరించాడు. హెల్మెట్ కారణంగా తన తలపై దురద ఉందని చీకు పేర్కొన్నాడు. ఆ తరువాత అతడు కార్ల అసెంబ్లింగ్ లైన్ తిరుగుతూ.. అక్కడ కార్లను ఎలా అసెంబ్లిగ్ చేయాలో తెలుసుకుంటాడు. చుట్టూ తిరుగుతూ టైర్ ర్యాక్ దగ్గరికి వస్తాడు, అసెంబ్లీ లైన్‌పై ఉన్న ఫ్యాన్ చూసి ఒక్కసారిగా షాక్‌కు గురవుతాడు.

ఇదీ చదవండి: కంపెనీ పెట్టండి.. పెట్టుబడి నేను పెడతా - ఆనంద్ మహీంద్రా

చీకు అక్కడే ఉన్న మహీంద్రా XUV700 డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు, కానీ అతని వల్ల కాకపోవడంతో సిబ్బంది సహాయం చేస్తారు. కారులో కూర్చున్న తర్వాత సన్‌రూఫ్‌ను ఓపెన్ చేయమని అలెక్సాని అడుగుతాడు. చివరకు ఒక చిన్న చెట్టును నాటడం ద్వారా మహీంద్రా ప్లాంట్‌ పర్యటనను ముగించుకుంటాడు.

ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేస్తూ.. వైరల్ వీడియోతో చీకు చకన్ ప్లాంట్‌ను సందర్శించి, చిరునవ్వులు చిందించాడు. ఇప్పుడు తన తండ్రితో రూ. 700లకు థార్ కొనమని అడగకుండా ఉంటాడని ఒక ఎమోజీ యాడ్ చేసి ట్వీట్ చేసాడు.

whatsapp channel

మరిన్ని వార్తలు