SkyWays-SL Sharma: మేడ్‌ ఇన్‌ ఇండియాతో దేశాభివృద్ధి

9 Aug, 2022 18:07 IST|Sakshi

‘మేడ్‌ ఇన్‌ ఇండియా’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కారణంగా దేశం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని స్కైవేస్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎస్‌ఎల్‌ శర్మ అన్నారు. సోమవారం చెన్నైలో లాజిస్టిక్స్‌ దిగ్గజమైన స్కైవేస్‌ గ్రూప్‌ 40 “వ్యవస్థాపక దినోత్సవం, చెన్నై శాఖ 20 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు.

నిజాయితీ, నిబద్ధత, కస్టమర్లకు మెరుగైన సేవలు ప్రధానంగా చేసుకుని నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్నట్టు తెలిపారు. దక్షిణ భారతదేశంలోని ఉత్పాదక నగరాలకు తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చెన్నైతో పాటు తిరుచ్చి, మధురై, కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్, వెల్లూరు, అంబూర్, తంజావూరు, వంటి అనేక నగరాలతోపాటు దక్షిణ భారత మార్కెట్‌పై స్కైవేస్‌ గ్రూప్‌ దృష్టి సారిస్తోందని ఈ సందర్భంగా వివరించారు. మేకిన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ ఇండియా ఇండియాతో ఉత్పత్తి పెరిగి లాజిస్టిక్‌ సంస్థల్లో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ యాష్‌ పాల్‌ శర్మ పాల్గొన్నారు.

చదవండి: ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు ఆవిరి.. ఇప్పట్లో లేదని కేంద్రం క్లారిటీ!

మరిన్ని వార్తలు