అక్టోబర్ 1 నుంచి ఈ బ్యాంకుల చెక్ బుక్‌లు పనిచేయవు

21 Sep, 2021 19:58 IST|Sakshi

మీకు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లో బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే, ఒక హెచ్చరిక. ఈ రెండు బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్‌లు వచ్చే నెల అక్టోబర్ 1 నుంచి చెల్లుబాటు కావు. అంటే ఈ చెక్ బుక్స్ ద్వారా బ్యాంక్ కస్టమర్లు ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేరు. కాబట్టి ఈ బ్యాంకు ఖాతాదారులు వెంటనే కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలంటూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ తెలిపింది.

ఓబీసీ, యూబీఐ రెండూ ఏప్రిల్ 2020లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు విలీనమైనప్పటికీ ఇప్పటి వరకు పాత బ్యాంకుల చెక్‌బుక్‌లనే కొనసాగించారు. ఈ రెండు బ్యాంకుల కస్టమర్లు వీలైనంత త్వరగా పీఎన్‌బీ ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది. ఏటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, పీఎన్‌బీ వన్‌ నుంచి వీటిని పొందొచ్చని పేర్కొంది. లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని తెలిపింది. ఏదైనా సాయం లేదా క్వైరీ కొరకు కోసం టోల్ ఫ్రీ నెంబరు 1800-180-2222ని సంప్రదించండి అని కూడా తెలిపింది.(చదవండి: భారీ లాభాలను గడించిన డ్రీమ్‌-11..! ఏంతంటే..?)

మరిన్ని వార్తలు