చెక్ బుక్ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్!

8 Aug, 2021 20:33 IST|Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆగస్టు 1 నుంచి బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నిబందనలు చెక్ బుక్ లకు కూడా వర్తిస్తాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ఏసీహెచ్) రోజుకు 24 గంటలు పనిచేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ కొత్త నిబందనలు జాతీయ & ప్రైవేట్ బ్యాంకులకు వర్తిస్తాయి. ఈ కొత్త నియమం వల్ల ఖాతాదారులు జారీ చేసిన చెక్కులు సెలవుదినాలలో కూడా సులభంగా క్లియర్ అవుతాయి. ఈ కొత్త నియమం వల్ల ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంది. 

ముఖ్యంగా మీరు చెక్ జారీ చేసిన తర్వాత బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిల్వ ఉంచాలి. అప్పుడే చెక్ సులభంగా క్లియర్ అవుతుంది. ఒకవేళ మీరు సెలవు దినాలు కదా అని సరిపడా నగదు నిల్వ చేయకపోతే మీ చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మీరు జరిమానా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే చెక్ బుక్ గల వినియోగదారులు సెలవుదినాల్లో కూడా ఎన్ఏసీహెచ్ పనిచేస్తుందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ఏసీహెచ్ అనేది ప్రాథమికంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ సీపీఐ) నిర్వహించే బల్క్ పేమెంట్ సీస్టమ్. ఇకపై జీతాలు, పెన్షన్, వడ్డీ, ఈఎంఐలు, టెలిఫోన్ బిల్లులు, గ్యాస్ బిల్లులు, సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ లాంటివన్నీ ఒకటో తేదీన జమ/కట్ కావడం జరుగుతుంది.

మరిన్ని వార్తలు