-

చైనా మరో కుతంత్రం..! ఏకంగా 30 విమానాశ్రయాల నిర్మాణం..!

16 Sep, 2021 17:26 IST|Sakshi

లాసా: భారత్‌పై చైనా తన కుతంత్రాలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. వాణిజ్యపరంగా, భౌగోళికంగా భారత్‌ను దెబ్బకొట్టేందుకు చైనా తన ప్రయత్నాలను ముమ్మురం చేసింది. దాయదాది దేశం పాకిస్థాన్‌తో స్నేహం చేస్తూ చైనా ఇష్టరీతినా వ్యవహరిస్తోంది. 2013 నుంచి చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్ కారిడార్‌ కింద పాకిస్థాన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చైనా ప్రారంభించింది. ఈ కారిడర్‌పై భారత్‌ అంతర్జాతీయంగా చైనా కుతంత్రాలను వెలుగులోకి తెచ్చింది.
చదవండి: బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటులో కీలక అడుగు

చైనా-పాకిస్థాన్‌ ఎకానమిక్‌ కారిడార్‌ను చట్టవిరుద్దమైందని భారత్‌ పేర్కొంది. ఈ కారిడార్‌ జమ్మూ కశ్మీర్‌, లడఖ్‌  ప్రాంతాలగుండా వెళ్తోందని భారత విదేశీ వ్యవహారాల  మంత్రిత్వ శాఖ గత ఏడాది లోక్‌సభలో వెల్లడించింది.  భారత్‌పై చైనా కుతంత్రాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. తాజాగా టిబెట్, జిన్జియాంగ్ ప్రావిన్స్‌లలో దాదాపు 30 విమానాశ్రయాలను చైనా నిర్మించినట్లు వార్తలు వస్తోన్నాయి. చైనా ఆర్మీ​కి ఆయుధాలను, సైనికుల రవాణా సులభంగా ఉండేందుకుగాను 30 సివిల్‌ ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించినట్లు చైనా మీడియా పేర్కొంది. ఉరుమ్కి, కష్గర్, లాసా, షిగాట్సే ఇతర ప్రదేశాలలో ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించినట్లు తెలుస్తోంది.  భారత సరిహద్దులోని మారుమూల ప్రాంతాలలో చైనా, పౌర సైనిక మౌలిక సదుపాయాలను పెంపొందిస్తుందని చైనా అధికారిక మీడియా నివేదించింది.

భారత సరిహద్దు ప్రాంతాల్లో పౌర విమానయానం వేగంగా అభివృద్ధి చెందడంతో వాయు రవాణా సౌలభ్యం మరింత సులభమవుతోందని చైనా ఆర్మీ అధికారి చెప్పారు. ఈ విమానశ్రాయాలతో డబ్ల్యుటిసి జిన్జియాంగ్,  టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతాలతో పాటు భారత సరిహద్దును పర్యవేక్షించనుంది.టిబెట్‌లో చైనాలో మౌలిక సదుపాయాలను పెంచుతోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌కు దగ్గరగా ఉన్న టిబెటన్ సరిహద్దు పట్టణమైన నింగింగ్‌తో ప్రావిన్షియల్ రాజధాని లాసాను కలిపే హైస్పీడ్ బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ టిబెట్‌ సరిహద్దు ప్రాంతాలను సందర్శించాడు. టిబెటిన్‌ సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన తొలి చైనా నాయకుడు. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇటీవల నింగిచిని సందర్శించారు, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించిన మొదటి చైనా నాయకుడు. 

చదవండి: Old Phones: చైనాలో ఆంక్షలు.. పాత ఫోన్లకు భలే గిరాకీ! 

మరిన్ని వార్తలు