క్యూ3లో చైనా వృద్ధి 4.9 శాతం

19 Oct, 2021 06:23 IST|Sakshi

జూన్‌ త్రైమాసికం 7.9 శాతంకన్నా తక్కువ  

బీజింగ్‌: చైనా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మూడవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెపె్టంబర్‌) 4.9 శాతంగా నమోదయ్యింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంతో పోలి్చతే (7.9 శాతం) వృద్ధి రేటు తగ్గడం గమనార్హం. కరోనా సవాళ్లకుతోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని తాజా గణాంకాలు సంకేతాలు ఇస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 18.3 శాతం పురోగమించిన సంగతి తెలిసిందే. మూడు త్రైమాసికాల్లో ఎకానమీ 9.8 శాతం వృద్ధి సాధించినట్లు నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిక్స్‌ (ఎన్‌బీఎస్‌) పేర్కొంది.

ఈ తొమ్మిది నెలల్లో వినియోగం వాటా మొత్తం జీడీపీలో 64.8 శాతంగా ఉందని ఎన్‌బీఎస్‌ ప్రతినిధి ఫు లింగ్హవా పేర్కొన్నారు.  కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో 2020 తొలి త్రైమాసికం మినహా గత ఏడాది మిగిలిన మూడు త్రైమాసికాల్లోనూ వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం.  కరోనా సవాళ్లతో 2020 మొదటి త్రైమాసికం జనవరి–మార్చి మధ్య 44 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా 6.8 శాతం క్షీణతకు (2019 ఇదే కాలంతో పోల్చి) జారిపోయిన చైనా ఆర్థిక వ్యవస్థ, మరుసటి క్వార్టర్‌ (ఏప్రిల్‌–జూన్‌)లోనే 3.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. 

వరుసగా రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్‌ మధ్యా  ఆ దేశ ఎకానమీ 4.9 శాతం వృద్ధి రేటును  నమోదుచేసుకుంది. అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో భారీగా 6.5 శాతం వృద్ధిని సాధించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 2.3 శాతం వృద్ధి రేటును (జీడీపీ విలువ 15.42 ట్రిలియన్‌ డాలర్లు) నమోదుచేసుకుంది. అయితే గడచిన 45 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత తక్కువ స్థాయిలో దేశం వృద్ధి రేటు నమోదుకాలేదు. 2021లో దేశ ఎకానమీ పదేళ్ల గరిష్ట స్థాయిలో 8.4 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటుందని ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. 

మరిన్ని వార్తలు