వావ్‌! వాట్‌ ఏ కూల్‌ గ్యాడ్జెట్‌.. పది నిమిషాల్లోనే మీ వాతావరణం మారుస్తుంది

31 Jul, 2022 11:35 IST|Sakshi

వేసవిలో ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్‌ పార్టీలు చేసుకునేందుకు ఎవరైనా సాహసిస్తారా? వేసవి ఎండలను తలచుకుంటేనే ముచ్చెమటలు పోస్తాయి, ఇక ఆరుబయట పిక్నిక్‌ పార్టీలు కూడానా అని అనుకుంటున్నారా? మరేం ఫర్వాలేదు ఈ ఫొటోలో కనిపిస్తున్న పోర్టబుల్‌ ఎయిర్‌ కండిషనర్‌ వెంట ఉంటే, వేసవిలోనైనా ఆరుబయట వనభోజనాలు, పిక్నిక్‌ పార్టీలు భేషుగ్గా చేసుకోవచ్చు.

ఇళ్లల్లో అమర్చుకునే ఏసీల మాదిరిగా దీనికి ఇన్‌స్టాలేషన్‌ బెడద ఉండదు. ఎక్కడికంటే అక్కడకు తేలికగా తీసుకుపోవచ్చు. దీని బరువు పది కిలోలు మాత్రమే. పవర్‌ అడాప్టర్‌ ద్వారా దీన్ని కనెక్ట్‌ చేసుకోవచ్చు. దీని ఉష్ణోగ్రతను 16 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ వరకు కోరుకున్న రీతిలో అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. ఆన్‌ చేసుకున్న పది నిమిషాల వ్యవధిలోనే పరిసరాల్లోని ఉష్ణోగ్రతను ఇది ఇట్టే చల్లబరచేస్తుంది. చైనాకు చెందిన ‘నైట్‌కోర్‌’ బహుళజాతి సంస్థ ఈ పోర్టబుల్‌ ఏసీని అందుబాటులోకి తెచ్చింది.

చదవండి: Smartphone Printer: సెల్ఫీ లవర్స్‌ కోసం.. అదిరిపోయే ఫీచర్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ సొంతం!

మరిన్ని వార్తలు