క్రిప్టో కరెన్సీ: ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌.. ‘సొల్లు’ రీజన్స్‌!! అనూహ్య ప్రకటన

25 Sep, 2021 09:40 IST|Sakshi

China Crackdown Crypto Trading: అంతర్జాతీయ మార్కెట్‌లో రారాజుగా మారాలన్న చైనా ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసి కొడుతున్నాయి.  స్వీయ అపరాధాలతో పతనం వైపుగా అడుగులు వేస్తోంది. మరోవైపు చైనా కుబేరులు సైతం నష్టాల్ని చవిచూస్తున్నారు. మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుండడం చైనాకు మింగుడు పడడం లేదు. ఈ తరుణంలో డ్రాగన్‌ కంట్రీ  చేసిన తాజా ప్రకటన ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తోంది. 


ప్రస్తుతం డిజిటల్‌ ట్రేడింగ్‌లో క్రిప్టో కరెన్సీ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో  ఈ కరెన్సీని నిషేధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది చైనా. క్రిప్టో అనేది ఫ్లాట్ కరెన్సీ కాదని వాదిస్తున్న చైనా.. వీలైనంత త్వరలో తమ దేశంలో నిషేధించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది.  మరోవైపు క్రిప్టో కరెన్సీ సంబంధిత లావాదేవీలన్నీ చట్టవ్యతిరేకమైనవని చైనా కేంద్రీయ బ్యాంకు స్పష్టం చేసింది.

పడిపోయిన టోకెన్‌ ధరలు
డిజిటల్‌ కరెన్సీ
ని నిషేధించాలని డ్రాగన్‌ కంట్రీ ప్రకటన..  డిజిటల్‌ ట్రేడ్‌పై ప్రతికూల ప్రభావం చూపెట్టింది. వర్చువల్‌ కరెన్సీ విలువల్లో విపరీత మార్పులు తెచ్చింది. క్రిప్టోకరెన్సీల విలువ(బిట్‌ కాయిన్‌, ఎథెరియమ్‌)లు ఒక్కసారిగా పడిపోయింది.  బిట్‌కాయిన్‌ విలువ ఐదు శాతం పడిపోయి 42,232 డాలర్లకు చేరింది.  ఇక రెండో అతిపెద్ద టోకెన్‌గా పేరున్న ఎథెరియమ్‌ విలువ 6.3 శాతం డ్రాప్‌ అయ్యి 2,888కు చేరింది.  సోలానా 6.9శాతం తగ్గిపోయి 134 డాలర్లకు చేరింది. ఇక లైట్‌కాయిన్‌ విలువ 5.9 శాతం తగ్గి 149 డాలర్లకు చేరుకుంది. కార్డానో విలువ 2.4 శాతం పడిపోయి.. 2.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 

చైనా అభ్యంతరాలు
క్రిప్టో కరెన్సీ లావాదేవీల మనుగడ దేశీయ మార్కెట్‌కు నష్టమని చైనా అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలోనే క్రిప్టో సంబంధిత లావాదేవీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటోంది.  విదేశీ సంస్థలు అందించే క్రిప్టో సేవలు అక్రమమైనవేనని పేర్కొంది. అదే సమయంలో దేశంలో బిట్‌కాయిన్ సహా క్రిప్టో కరెన్సీ మొత్తాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ సలహా ఇచ్చింది.


డిజిటల్‌ ట్రేడింగ్‌లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుంది.

ఎలన్‌ మస్క్‌ లాంటి బిలియనీర్ల ప్రోత్సాహంతో.. జనాలు సైతం ఈ-కరెన్సీపై నమ్మకం పెంచుకుంటున్నారు.

ప్రపంచంలో చాలా దేశాలు క్రిప్టోకరెన్సీ లావాదేవీల్ని అనుమతిస్తున్నాయి.

చైనా అతిపెద్ద క్రిప్టోకరెన్సీకి మార్కెట్‌ కూడా. 

అయినప్పటికీ చైనా మాత్రం క్రిప్టో కరెన్సీని అంగీకరించడం లేదు

ఆర్థిక వ్యవస్థకు ఒరిగేదీ ఏమి లేదని, పైగా వర్చువల్‌ కరెన్సీ వల్ల కార్బన్‌ ఉద్గారాలు ఉధృతంగా ఉత్పత్తి అవుతాయని సొల్లు కారణాలు చెబుతోంది. 

మే నెలలో చైనా స్టేట్‌ కౌన్సిల్‌ ఏకంగా బిట్‌కాయిన్‌ మైనింగ్‌ను మూసేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

 నిషేధ నిర్ణయం గనుక అమలు అయితే.. భారీగా నష్టపోయేది ముందుగా చైనానే!


చదవండి: క్రిప్టోకరెన్సీకి పోటీ! సరికొత్త వ్యూహంతో ఆఫ్రికన్‌ దేశాలు

ఇదీ చదవండి: Bitcoin: బిట్‌కాయిన్‌ సృష్టికర్త ఎవరో తెలుసా...!

మరిన్ని వార్తలు