అంతరిక్ష పోటీలో డ్రాగన్‌ దూకుడు.. ఫలిస్తే స్పేస్‌లో క్యాన్సర్‌ చికిత్స?!

3 Aug, 2021 13:04 IST|Sakshi

సంచలనానికి చైనా సిద్ధపడింది. సొంత స్పేస్‌ స్టేషన్‌ ‘టియాన్‌గోంగ్‌’ ద్వారా అరుదైన ప్రయత్నానికి సిద్ధపడింది. త్వరలో ప్రారంభం కానున్న(పూర్తి స్థాయిలో) ఈ స్పేస్‌ స్టేషన్‌ ద్వారా ఒకేసారి వెయ్యి ప్రయోగాలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఇందులో క్యాన్సర్‌కి ‘స్పేస్‌ ట్రీట్‌మెంట్‌’  సంబంధిత ప్రయోగాలు కూడా ఉండడం విశేషం.


బీజింగ్‌: మెడికల్‌ రీసెర్చ్‌, సాంకేతిక అధ్యయనాలతో పాటుగా వెయ్యి ప్రయోగాలను అదీ ఒకేసారి స్పేస్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ స్టేషన్‌లో నిర్వహించాలని చూస్తోంది. భూమి నుంచి 388.9 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ స్పేస్‌ ఏజెన్సీలోకి ఇంటర్నేషనల్‌ స్పేష్‌ ఏజెన్సీ(ఐఎస్‌ఎస్‌), రష్యా స్పేస్‌ ఏజెన్సీ మిర్‌ లాగా ఇతర దేశాల స్పేస్‌ సైంటిస్టులకు అనుమతి ఇవ్వకూడాదని నిర్ణయించుకుంది. 

మైక్రోగ్రావిటీ ప్రయోగాలు
ఇక స్పేస్‌ స్టేషన్‌ ద్వారా ప్రయోగాలకు డిఫరెంట్‌ మాడ్యూల్స్‌ను(ఇప్పటికే మూడు ఉన్నాయి) ఏర్పాటు చేయబోతోంది డ్రాగన్‌ కంట్రీ. నేచర్‌ కథనం ప్రకారం.. హై ఎనర్జీ కాస్మిక్‌ రేడియేషన్‌ను గుర్తించడానికి 1-2బిలియన్ల యువాన్లను(దాదాపు 310 బిలియన్‌ డాలర్లు)దాకా ఖర్చు చేయబోతోంది. తద్వారా కాస్మిక్‌ కిరణాలు, చీకటి సంబంధిత అధ్యయనాలను సులువుగా కొనసాగించనుంది. 

అంతరిక్షంలో చికిత్స?
స్పేస్‌ క్రోగ్రావిటీలో క్యాన్సర్‌ మీద కూడా అధ్యయనం చేపట్టాలని చైనా నిర్ణయించుకుంది. త్రీడీ బ్లాబ్స్‌ను పంపడం ద్వారా ఆరోగ్యవంతమైన వాటితో పాటు క్యాన్సర్‌ కణజాలాల మీద ఏకకాలంలో ప్రయోగాలు నిర్వహించనుంది. తద్వారా.. తక్కువ గ్రావిటీ వాతావరణంలో(అంతరిక్షంలో) క్యాన్సర్‌ కణాల పెరుగుదల నెమ్మదించడమో లేదంటే పూర్తిగా ఆగిపోవడమో నిర్ధారించుకునే దిశగా ప్రయోగాలు చేయనుంది. ఈ ప్రయోగాలు ఫలిస్తే.. The China Manned Space Agency ‘అంతరిక్ష వైద్యానికి బీజం వేయనుంది.

అంటే క్యాన్సర్‌ పేషెంట్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లి చికిత్స అందించడమో లేదంటే అక్కడ తయారు చేసిన మందుల్ని ఉపయోగించడమో(భూ వాతావరణానికి తగ్గట్లు పనిచేసే విధంగా) ద్వారా సంచలనానికి తెర తీయాలనుకుంటోంది. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా.. ‘వ్యోమగాముల ఆరోగ్యం కోసం’ అనే హింట్‌ ఇవ్వడం ద్వారా భవిష్యత్తుల్లో క్యాన్సర్‌ పేషెంట్లకు స్పేస్‌ ట్రీట్‌మెంట్‌ అందించే ఆలోచన చేస్తున్నట్లు డ్రాగన్‌ కంట్రీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు ఓ ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు గ్లోబ​ల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.  

రెండు స్పేస్‌ ల్యాబ్‌లు
స్పేస్‌ స్టేషన్‌లో కొత్తగా రెండు ల్యాబ్‌లను ప్రారంభించాలని చైనా భావిస్తోంది. అయితే ఐఎస్‌ఎస్‌ లాగా కాకుండా.. ఒకేసారి వంద మంది చేరుకునే ప్రయోగానికి రెడీ అయ్యింది. ఇంకా చాలా ప్రయోగాలు అనుమతుల కోసం సిద్ధంగా ఉన్నాయని, చైనా ఆస్ట్రోఫిజిస్ట్‌ జాంగ్‌ షువాంగ్‌ నాన్‌ ‘నేచర్‌’తో వ్యాఖ్యానించాడు. వీటిలో చాలావరకు(తొమ్మిది ఇంటర్నేషనల్‌ ప్రాజెక్టులు కలిపి) ఇతర దేశాల సహకారంతోనూ నిర్వహించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు 40 దేశాల నుంచి అభ్యర్థనలు రాగా.. అమెరికా-రష్యాలతో పోటీపడి నిలబడేందుకు చైనాకు మంచి అవకాశమే దొరికినట్లయ్యింది.

మరిన్ని వార్తలు