గాల్లో తేలే రైళ్లు.. గంటకు 600కిమీ వేగం..!

20 Jul, 2021 19:38 IST|Sakshi

బీజింగ్‌: చైనా 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే మాగ్లెవ్‌ రైలును లాంచ్‌ చేసింది. ఈ రైళ్లతో బీజింగ్ నుంచి షాంఘైకి వెయ్యి కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండున్నర గంటల్లో చేరుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపింది. ఒకవేళ  విమానంలో వెళ్తే సుమారు 3 గంటల సమయం పట్టనుంది. విమానం కంటే వేగంగా మాగ్లెవ్‌ రైలు వెళ్లనుంది. ఖింగ్దావ్‌లో చైనా ఈ రైలును అభివృద్ధి చేసింది.

గాల్లో తేలే రైళ్లు..
సాధారణ రైళ్లకు, మాగ్లెవ్‌ రైళ్లకు చాలా వ్యత్యాసం ఉంది. సాధారణ రైళ్లు పట్టాలపై  పరుగులు తీస్తాయి. కానీ ఈ మాగ్లెవ్‌ రైళ్లకు పట్టాలున్నా.. పట్టాలపై పరుగులు తీయదు. పట్టాలకు తాకకుండా విద్యుదయస్కాంత శక్తితో గాల్లో కొంత ఎత్తులో రైలు నడుస్తుంది. చైనా గత రెండు దశబ్దాలుగా మాగ్లెవ్‌ రైళ్ల టెక్నాలజీను ఉపయోగిస్తుంది. పరిమిత సంఖ్యలో మాగ్లెవ్‌  చైనాలో నడుస్తున్నాయి. జపాన్‌, జర్మనీ వంటీ దేశాలు మాగ్లెవ్‌ రైలును అభివృద్ది చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు